WTC ఫైనల్..ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023–25 సైకిల్‌కు సంబంధించిన బహుమతి వివరాలను ప్రకటించింది. ఈ సారి చాంపియన్ జట్టు కోసం రికార్డ్ స్థాయిలో USD 3.6 మిలియన్ బహుమతిని అందించనున్నారు.

WTC ఫైనల్ వచ్చే నెలలో లార్డ్స్‌ మైదానంలో జరగనుండగా, ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా మధ్య చారిత్రాత్మక పోరు జరగనుంది. వరుసగా రెండో WTC టైటిల్‌ లక్ష్యంగా ఆస్ట్రేలియా బరిలో నిలవగా విజేత జట్టుకు USD 3.6 మిలియన్ (సుమారు ₹30.79 కోట్లు) అందనుంది.

రన్నరప్‌కు USD 2.16 మిలియన్ (సుమారు ₹18.47 కోట్లు), భారత్ (మూడో స్థానంలో): సుమారు ₹12.32 కోట్లు పొందనుంది. దక్షిణాఫ్రికా మొదటిసారిగా WTC ఫైనల్‌కి అర్హత సాధించింది. పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకపై విజయాలు సాధించగా టీమిండియాతో సిరీస్ డ్రా అయింది. ఐసీసీ టైటిల్ గెలుచుకునే అరుదైన అవకాశం ఇది…. లార్డ్స్ మైదానం దీనికి అద్భుతమైన వేదిక అన్నారు దక్షిణాఫ్రికా కెప్టెన్ బావుమా.

రెండోసారి WTC టైటిల్‌ను గెలవడమే లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగింది. భారత్‌పై 3–1 సిరీస్ విజయం (బోర్డర్–గావస్కర్ ట్రోఫీ) విజయం సాధించగా పాకిస్తాన్‌పై 3–0, అలాగే న్యూజిలాండ్, శ్రీలంకపై విజయం సాధించింది ఆసీస్.