Monday, May 20, 2024
- Advertisement -

ఆసీస్‌ వర్సెస్ భారత్..గెలిచేదెవరో?

- Advertisement -

ప్రపంచకప్ ఫైనల్‌కు చేరింది ఆస్ట్రేలియా. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్‌లో భారత్‌తో తలపడనుంది ఆస్ట్రేలియా. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్.. 47.2 ఓవర్లలో 7 వికెట్లు కొల్పోయి 215 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ట్రావిస్‌ హెడ్‌ 62 పరుగులు చేయగా స్మిత్‌ 30, జోష్‌ ఇంగ్లిస్‌ 28, డేవిడ్‌ వార్నర్‌ 29 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. భారీ అంచనాల మధ్య వచ్చిన సఫారీ బ్యాట్స్‌మెన్ పూర్తిగా నిరాశ పర్చారు. కేవలం 24 పరుగులకే 4 వికెట్లు కొల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడ్డారు. దీంతో దక్షిణాఫ్రికా వంద పరుగులైనా చేస్తుందా అన్న సందేహం అందరిలో నెలకొంది. కానీ ఈ దశలో క్రీజులోకి వచ్చిన క్లాసన్, మిల్లర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. క్లాసన్ 47 పరుగులు చేయగా మిల్లర్ సెంచరీతో రాణించాడు. డేవిడ్‌ మిల్లర్‌ 116 బంతుల్లో 5 సిక్స్‌లు,8 ఫోర్లతో 101 పరుగులు చేశారు. బవుమా (0), డికాక్‌ (3), మార్క్మ్‌ (10), డసెన్‌ (6) అంతా విఫలమయ్యారు. దీంతో 49.4 ఓవర్లలో 212 పరుగులకు దక్షిణాఫ్రికా ఆలౌటైంది. ట్రావిస్ హెడ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -