Sunday, May 4, 2025
- Advertisement -

అద్వాని,ఉమాభార‌తిల‌కు సుప్రీం షాక్‌

- Advertisement -
babri masjid case charges revived against advani joshi uma

బాబ్రిమ‌సీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్ర‌నేత‌లు ఎల్‌కె అద్వానీ,ఉమాభార‌తితో స‌హా ప‌లువురు నేత‌ల‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గ‌తంలో అలహాబాద్ హైకోర్టు్  వీరంద‌రినీ నిర్ధోషులుగా ప్ర‌క‌టించింది.అయితే ఈకేసులో సీబీఐ సుప్రీంకోర్టు న్యాయ స్తానాన్ని అశ్ర‌యించారు. కేసును విచారించి  అత్యున్న‌త న్యాయ‌స్థానం అలహాబాద్ హైకోర్టు్ ఇచ్చిన తీర్పును  ప‌క్క‌న పెట్టింది.

దీంతో  బాబ్రీ మసీదు కూల్చివేతలో అద్వానీ, ఉమాభారతి, మురళీ మనోహర్ జోషి సహా పలువురిపై కుట్రదారుల చేర్చి కేసును పునర్విచారించాలని సుప్రీం తేల్చింది.   గ‌తంలో సుప్రీంకోర్టు రెండేళ్లలో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని  ఆదేశాలు జారీ చేసింది. లక్నో ట్రయల్ కోర్టులో విచారణకు అనుమతించింది. ఇప్పటికే పాతికేళ్లు ముగిసిపోయిందని, కాబట్టి త్వరగా ముగించాలని చెప్పింది. కాగా, కళ్యాణ్ సింగ్‌పై కేసుకు మినహాయింపు ఉంది. ఆయన ప్రస్తుతం రాజస్థాన్ గవర్నర్‌గా ఉన్నారు.

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసుపై రోజు వారీ విచారణ జరిగే అవకాశముంది. అద్వానీ, ఉమాభారతి, జోషి, కళ్యాణ్ సింగ్ సహా మొత్తం 12 మంది నేతలు గుర్తు తెలియని కరసేవకులను ప్రోత్సహించారని కేసు నమోదయింది. వీరిపై కుట్ర కేసును అలహాబాద్, లక్నో కోర్టులుగతంలో కొట్టి వేశాయి. దీనిపై సుప్రీం కోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. బుధవారం సుప్రీం కోర్టు అలహాబాద్ కోర్టు తీర్పును తప్పుబట్టింది. కుట్ర అభియోగాలను పునరుద్ధరించింది.  సుప్రీంతీర్పుతో బీజేపీ ఇది  గట్టి ఎదురుదెబ్బె. మ‌రోవైపు రాష్ట్ర‌ప‌తిని రేసులో ఉన్న అద్వానీ ఇది శ‌రాఘాత‌మే.

Related

  1. జగన్ కు ఎంత గొప్ప మనసు ఉందో ఇది చదివితే తెలుస్తుంది
  2. ఎన్టీఆర్ కొత్త పార్టీ.. చంద్రబాబుపై కోపంతోనా..?
  3. బర్త్ డే రోజు వస్తుంటే వణికిపోతున్న బాబు.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు
  4. లోకేష్, జలీల్.. ఇద్దరూ ఇద్దరే..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -