Monday, May 20, 2024
- Advertisement -

బర్త్ డే రోజు వస్తుంటే వణికిపోతున్న బాబు.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు

- Advertisement -

chandrababu shaking about his birthday

బర్త్ డే అంటే అనందం ఎవరికైన ఉంటుంది. కానీ ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం బర్త్ డే వస్తుందంటే గజగజా వణికిపోతున్నాడు. మరో నాలుగు రోజుల్లో అంటే ఈ నెల 20న ఏపీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు. చంద్రబాబు బర్త్ డే అంటే టీడీపీ తమ్ముళ్లకు పండుగ. ఏపీలో గ్రామగ్రామనా తెలుగు తమ్ముళ్లు బాబుగారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకుంటారు.

ఎప్పటిలాగానే ఈసారి కూడా బాబుగారి పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఒక పక్క తెలుగు తమ్ముళ్లు సిద్ధమవుతుంటే ..మరో పక్క బాబుగారు మాత్రం కంగారు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కడ తన తనయుడు అంబేడ్కర్ జయంతి నాడు అంబేడ్కర్ 126వ వర్థంతి శుభాకాంక్షలు అని పరువు తీసినట్లు రేపు తన పుట్టిన రోజు నాడు పార్టీ కార్యాలయంలోనో, మరెక్కడైనా తెలుగు తమ్ముళ్లు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ ” నాన్నారికి 68 వ పుట్టిన రోజు శుభాకాంక్షలు అనబోయి 68వ వర్థంతి శుభాకాంక్షలు అంటాడో లేదా 68వ జయంతి శుభాకాంక్షలు”  అని అంటాడో అని చంద్రబాబు కంగారుపడుతున్నట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

అందుకే ఈసారి పుట్టిన రోజు వేడుకలు స్పీచ్‌లు, గట్రా లేకుండా సింపుల్‌గా లాగించేయండి..చినబాబును పిలవకండి అని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో లోకేష్ తెలుగుతో తన పరువు పోతుందని చంద్రబాబు భయపడుతున్నాడంటూ నెట్‌జన్లు సైటిరికల్‌గా పోస్టులు పెడుతున్నారు. నిజమే కదా..లోకేష్ బాబు తెలుగు చూసి ఎక్కడ తనకు నాన్నారు వర్థంతి శుభాకాంక్షలు అని చెబుతాడో అని చంద్రబాబు ఉలిక్కిపడడంలో ఆశ్చర్యం లేదు కదా.. 

Related

  1. బాబుతో స‌మావేశ‌మైన మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి  
  2. చిత్తూరు జిల్లాలో టీడీపీకీ మ‌రోషాక్‌… వైసీపీ వైపు ఎంపీ శివ‌ప్ర‌సాద్ చూపు
  3. ఖ‌రీదైన కూలీ కేటీఆర్
  4. లోకేష్ మంత్రి స్థానంలో ఉండి.. ‘వర్థంతి శుభాకాంక్షలు’ అని ఎవరైనా చెబుతారా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -