Sunday, May 19, 2024
- Advertisement -

అక్కినేని అఖిల్ ని రోడ్డుకి లాగిన మంచు లక్ష్మి.

- Advertisement -

కంగారు పడకండి అంతా మంచికేలెండి. మంచు లక్ష్మి పుణ్యమా అంటూ హైదరాబాద్ జనాలు ఇప్పుడు స్టార్ హీరోలనీ, హీరోయిన్ లనీ రోడ్ల మీద చూస్తున్నారు. ఆమె ప్రోగ్రాం ‘ మేము సైతం ‘ కోసం రకుల్ ప్రీత్ సింగ్ మొన్ననే కుకట్ పల్లి లో కూరలు అమ్మగా ఇప్పుడు అక్కినేని వారాసుడు హీరో అఖిల్ ఏకంగా ఆటో తోలుతున్నాడు.

మేముసైతం  కార్యక్రమానికి చెందిన రెండో ఎపిసోడ్ నిన్న కమ్మం లో షూట్ చేశారు.  ఈసారి అఖిల్ వంతొచ్చింది. కుర్రాడికి యూత్ లో ఉన్న క్రేజ్ దృష్ట్యా.. మనోడ్ని ఏకంగా ఆటో డ్రైవర్ చేశారట. ఏకంగా నిజంగానే ప్యాసింజర్లను ఎక్కించుకుని.. ఆటో నడిపి.. వారి దగ్గర పైకం కూడా తీసుకున్నాడట అఖిల్. అసలు ఈ ప్రోగ్రాం కాన్సెప్టు ఏంటో తెలియట్లేదు కాని.. వింటుంటేనే ఫుల్ కిక్కిస్తోంది. ఇలా ఎంత మంది సెలెబ్రిటీ లని మంచు లక్ష్మి అక్క రోడ్ల మీదకి లాగి మేము సైతం అంటూ కొత్త హడావిడి చేయ్యిస్తుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -