కాపు ఐక్య గర్జన పేరుతో కొందరు సంఘ విద్రోహ శక్తులు చేసిన దానికి రత్నాచల్ ఎక్స్ ప్రెస్ బొగ్గు బొగ్గు అయ్యింది. గత నెల 31 న తుని సమీపంలో జరిగిన ఈ దారుణం విశాఖ – విజయవాడ ల మధ్యలో ఎన్నో రైళ్ళు ఆగిపోవడానికి కూడా కారణం అయ్యింది.
ఇప్పటికే రైల్వే పోలీసులు ఈ ఘటనకి కారణంగా 45 మందిని గుర్తించారు. నిప్పుపెట్టిన సంఘటనతో సంబంధం లేకపోయినాగానీ ఆందోళనలో కాస్తంత ఉద్రేకంగా పాల్గొన్న వారిపై కూడా కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రైల్వే దర్యాప్తు బృందాలు చాలా లోతుగా దర్యాప్తును సాగిస్తూ సాధ్యమైనన్ని ఎక్కువ ఆధారాలను సేకరించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. రత్నాచల్ కి నష్టం కలిగించడం తో పాటు.
రైలులో ఉన్న ప్రయాణీకులకి తీవ్ర భయాందోళన కలగజేసిన వారి మీద రైల్వే శాఖ చాలా సీరియస్ గ ఆంది. సంఘటన విషయం లో చంద్రబాబు సైలెంట్ గా ఉన్నా కూడా రైల్వే శాఖ మాత్రం ఊరుకునే సమస్యే లేదు అంటోంది. దాంతో కాపు ఉద్యమం చల్లారినప్పటికీ రైల్వేశాఖ ఆగ్రహం మాత్రం ఇప్పట్లో చల్లారేలా లేదు. సంఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి పూర్తి వివరాలను సేకరించటం ఆధారాలను సేకరించటం పూర్తయిన వెంటనే రైల్వేశాఖ తన ప్రతాపాన్ని చూపించే అవకాశాలు ఉన్నాయి.
