Sunday, May 12, 2024
- Advertisement -

పవన్ వల్ల జగన్ భాదపడుతున్నాడా.. అందుకే ఇలా చేస్తున్నాడా..?

- Advertisement -
ap politics ys jagan takes on pawan kalyan

పవన్ కళ్యాణ్.. చిత్రాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నాడు. ఏపీలో ప్రజలు పడుతున్న సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తూ వారికి పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటికే చాలా సమస్యలపై పవన్ స్పందించారు. మొదట్లో పవన్ కళ్యాణ్‌ తెలుగుదేశం పార్టీతో పాటు బీజేపీకి తన సపోర్టు ఇవ్వడంతో ఆయన కూడా వారితో కలిసిపోయారని అందరూ అనుకున్నారు. అయితే ఇప్పుడు మొత్తం రివర్స్ అయ్యింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక తానేంటో చూపించాడు పవన్.

సాదాసీదాగా పెట్టుకున్న జనసేనకు ఏకంగా రాజకీయాల్లో పోటీ చేసే అర్హతను సంపాదించుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించాడు. దాంతో తెలుగుదేశం, వైకాపా నాయకుల్లో భయం పట్టుకుంది. పవన్ ఎన్నికల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోవడం ఖాయం అని నేతలు అభిప్రాయపడుతున్నారు. జగన్ సిఎం అవుతానని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి మరో రెండుసంవత్సరాల కాలం ఉండగానే ఇప్పటికైనా హడావిడి చేసేస్తున్నారు జగన్. దాంతో జగన్ పార్టీ నాయకులు అధికారం మాదే అన్న ఆనందంలో ఉన్నారు.

కానీ రాజకీయ విశ్లేషకుల ఆలోచన ప్రకారం పవన్ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి వస్తే జగన్ సీఎం అవ్వడం సాధ్యం కాదంటున్నారు. గత ఎన్నికల్లోలాగా పవన్ కళ్యాణ్‌ ఈ సారి కూడా ఎన్నికల్లో పోటీ చేయకుంటే జగన్‌కు ఛాన్సులు ఉన్నాయంటున్నారు. అయితే జగన్ మాత్రం ఈ విషయాన్ని ఇప్పటికే సీరియస్‌గా తీసుకున్నారట. పవన్ కదలికల్ని కనిపెట్టమని జగన్ కొంతమంది వ్యక్తులను సీక్రెట్‌గా నియమించేశారట. పవన్ రాజకీయాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారో తనకు తెలియజేయాలని చెప్పారట. దీంతో వారు పవన్ కళ్యాణ్‌‌ను ప్రతి నిమిషం గమనిస్తున్నారట. మొత్తం మీద పవన్ రావడం వల్ల జగన్ సీఎం అయ్యే అవకశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 

{youtube}D0kT7GEABus{/youtube}

Related

  1. పవన్ కు విలన్ గా మారిన గోపిచంద్
  2. ధరమ్ తేజ్ కోసం పవన్ ఆ పని చేస్తున్నాడు
  3. పవన్ కళ్యాణ్ ని వదలని అల్లు అర్జున్
  4. అల్లు అర్జున్ కోసం పవన్.. ఆ పని చేస్తాడా..? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -