- Advertisement -

బీచ్ ఫెస్టివల్ అంటే బికినీ వేసుకుని తిరగడం కాదు !

- Advertisement -
beach love does not stop

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం విడిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చెందించాలని అహర్నిశలు కృషి చేస్తున్న చంద్రబాబు వచ్చే ఏడాది ప్రేమికుల రోజున బీచ్ ఫెస్టివల్ ను విశాఖ సముద్ర తీరాన అట్టహాసంగా నిర్వహించడానికి తన శాయ శక్తులా ప్రయత్నం చేయడానికి బాబు సన్నాహాలు చేస్తుంటే,

ఎలాగైనా సరే మన తెలుగు సాంప్రదాయాలకు విరుద్ధంగా సంస్కృతిని కాలదన్ని ఈ ఫెస్టివల్ ని నిర్వహించడం విదేశీ సాంప్రదాయానికి నిదర్శనమని ప్రతిపక్షాలు దుమ్మెతి పోస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల విమర్శలను కట్టిపెడుతూ బాబు బీచ్ ఫెస్టివల్ కి అసలైన అర్థం చెప్పారు. బీచ్ ఫెస్టివల్ నిర్వహణను కొందరు అపహాస్యం చేసేలా ప్రకటనలు ఇస్తూ రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తాను మొదటి నుంచి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే వ్యక్తినని చెబుతూ.. విశాఖపట్నంలో బీచ్ ఫెస్టివల్‌ను నిర్వహించి తీరుతామని ఉద్ఘాటించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -