Monday, May 5, 2025
- Advertisement -

సీబీఐ కోర్టులో జ‌గ‌న్‌కు ఊర‌ట‌ బేయిల్ పిటీష‌న్‌ను కొట్టివేసిన కోర్టు

- Advertisement -
CBI Petition dismissed,YS Jagan gets permission New Zealand tour

జ‌గ‌న్ బేయిల్‌ను ర‌ద్యుచేయాల‌ని సీబీఐ వేసిన పిటీష‌న్‌ను సీబీఐకోర్టు కోట్టివేసింది. దీంతో జ‌గ‌న్‌కు పెద్ద ఊర‌ట లభించింది. గ‌త కొద్ది రోజులుగా జ‌గ‌న్ బేయిల్‌పై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌దించింది. జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది.అక్రమాస్తుల కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చిన జగన్‌ షరతులను ఉల్లఘించారని.. అందువల్ల ఆయన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానంలో పిటిషన్‌ వేసింది.

జగన్‌ ఉద్దేశపూర్వకంగానే సాక్షులను బెదిరిస్తున్నారని.. కోర్టులో విచారణను కూడా ప్రభావితం చేసేలా ప్రవరిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్‌రెడ్డి సాక్షి పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూనే ఇందుకు నిదర్శనమని సీబీఐ కోర్టుకు పేర్కొంది. అయితే సీబీఐ ఆరోపణలను జగన్‌ తరపు న్యాయవాదులు తోసిపుచ్చారు. సాక్షి నిర్వహణతో గానీ.. రమాకాంత్‌రెడ్డి ఇంటర్వ్యూ ఈ కేసు విచారణను ప్రభావితం చేసే అంశాలు లేవని పేర్కొన్నారు. వూహాజనిత అంశాలతో బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరడం సమంజసంగా లేదని వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం సీబీఐ పిటిషన్‌ను కొట్టివేసింది. దేశంలోనూ, ఏపీలోనూ ముందస్తు ఎన్నికల సంకేతాలు కనిపిస్తున్నాయి.

దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న మోడీ ఆలోచనకు చంద్రబాబు కూడా మద్దతు పలుకుతున్నారు.దాదాపు పాతిక మంది వరకూ ఎమ్మెల్యేలను టీడీపీ తన వైపుకు లాక్కొన్నా.. వైసీపీ తట్టుకుని నిలబడింది. ఐతే.. ఇప్పటివరకూ కేవలం శాంపిల్ మాత్రమే జరిగిందని.. ఇకపై అసలు సినిమా చూపిస్తామని కొందరు టీడీపీ నేతలు వైసీపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో తనకు ఉన్న పలుకుబడి ఉపయోగించి వచ్చే ఎన్నికల నాటికి జగన్ ను జైలులో ఉంచాలని చంద్రబాబు భావిస్తున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జగన్ కు గతంలో ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో పిటీషన్ వేయడం కలకల రేపుతోంది. జగన్ బెయిల్ పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇచ్చే సమయం కావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆసక్తి కనిపిస్తోంది.

బెయిల్ షరతులు ఉల్లంఘించినందు వల్ల జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించింది.సీబీఐ ఎన్ని షాకులు చెప్పినా సీబీఐ కోర్టు అవేవి ప‌ట్టించుకోకుండా పిటీష‌న్‌ను కోట్టి వేసింది.దీంతో వైసీపీ శ్రేణుల్లో అనందం వెల్లి విరిస్తోంది. దీంతో ఆపార్టీకీ భారీ ఊర‌ట ల‌భించిన‌ట్లుంది. అయితే టీడీపీ శ్రేనులు మాత్రం తీవ్ర ఆందోళ‌న‌లో ఉన్నారు. మ‌రో వైపు జ‌గ‌న్ కుటుంబంతో న్యూజిలాండ్ వెల్లాల‌ని అదే సీబీఐ కోర్లులో పిటీష‌న్‌ను పెట్టుకున్నారు. బేయిల్ పిటీష‌న్‌ను కోట్లివేయ‌డంతో న్యూజిల్యాండ్ వెల్లేందుకు మార్గం సుగుమ‌మ‌య్యింది.

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. జ‌గ‌న్‌పై లోకేష్ పోటీచేస్తారు బుద్ధా వెంక‌న్న స‌వాల్‌
  2. జ‌గ‌న్‌ ను టార్గెట్ చేసి మాట్లాడితే.. వాళ్లు మాత్రం మేయిన్ పేజీలో ఉంటారు
  3. జ‌గ‌న్‌కు ఇంకో షాక్.. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్‌..?
  4. ప్ర‌శాంత్ కిషోర్‌తో డీల్… 2019 ఎన్నికలకు జ‌గ‌న్ ప‌క్కావ్యూహం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -