చంద్రబాబునాయుడు,లోకేష్‌లకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్టుంది. ఒక వైపు లోకేష్ బాబుపరువు తీస్తుంటే… ఇక బాబుకు కూడా అదే చేదు అనుభవాలు ఎదరౌతున్నాయి. తాజాగా చంద్రబాబు అనంత పర్యటనలో రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబునాయుడు అనంతపురం జిల్లాలో గురువారం నాడు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. నీరు, ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న బాబుకు చేదు అనుభవం ఎదురైంది. గతంతో చంద్రబాబు,మంత్రులు ఇంకుడు గుంతల గురించి గొప్పలు చెప్పారు. అయితే ఇంకుడు గుంతల వల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని టిడిపి నాయకుడే చెప్పడంతో బాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు.
ఇంకుడు గుంతలకు రూ.7 లక్షల రూపాయాల ఖర్చు పెట్టానని, తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని ఆవేదన వ్యక్తం చేశారు టీడిపి నాయకుడు, రైతు రామ్మోహన్ చౌదరి చెప్పారు. ఇంకుడు గుంతల గురించి చంద్రబాబు గొప్పలు చెబుతున్న సమయంలోనే స్వంత పార్టీకి చెందిన నాయకుడు ఇలా మాట్లాడేసరికి షాకయ్యారు బాబు. ఊహించని పరిణామంతో బిత్తరపోయిన చంద్రబాబు జవాబు అసహనం వ్యక్తంచేసి సమాధానం చెప్పకుండా దాటవేశారు. దీంతో ఇప్పటి వరకు చెప్పుకున్న గొప్పలు తుస్సుమన్నాయి. బాబుతోపాటు అక్కడున్న టీడీపీ నాయులు రైతులనుంచి వ్యతిరేకత ఎదవరడంతో ఖంగుతిన్నారు.
ఇక లోకేష్‌కూడా అనంతపురం పర్యటనలో మల్లీ నోరు జారారు.మంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత లోకేష్ ప్రసంగంలో ఏదో తప్పు దొర్లుతోంది. అయితే ఈ తప్పులను ప్రత్యర్థులు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనంతపురం జిల్లాలో తొలిసారిగా గురువారం నాడు పర్యటించారు. ఇటీవల కాలంలో ఆయన నోరుజారిన ఘటనలు చోటుచేసుకొన్నాయి. మొదట్లో కొత్త కాబట్టి ప్రసంగాల్లో తప్పు దొర్లడం ఎవరికైనా సర్వసాధారనం. కానీ లోకేష్‌లో మాత్రం మార్పురావడంలేదు. కనీసం సీనియర్‌ల సలహాలు కూడా తీసుకోకండా తప్పుమీద తప్పు చేస్తూ అభాసు పాలవుతున్నారు.
ఇటీవల జరిగిన అంబేద్కర్ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో తాగునీటి సమస్య ఏర్పాటే తమ లక్ష్యమన్నారు. ఇప్పుడు ఆ రెండింటిని మించిపోయేలా మరో గొప్ప మాట అన్నారు.వచ్చే ఎన్నికల్లో టిడిపిని రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాల్లో గెలిపించాలని ఆయన కార్యకర్తలను కోరారు.ఆం ధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం 175 స్థానాలే. అలాంటప్పుడు 200 స్థానాల్లో ఎలా గెలిపించాలని అర్థం కాక కార్యకర్తలు గుసగుసలాడుకొన్నారు. పరిణామాలు చూస్తూంటే తండ్రీ,కొడుకులిద్దరీ బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యిందనడంలో సందేహంలేదు.
Related