సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ అవార్డుకు ఉన్నంత క్రేజ్ ఏదానికి ఉండదు. ఒక్క సారైనా తమ సినిమాలకు అస్కార్ అవార్డు రావాలని కలలు కంటారు. ఆస్కార్ అవార్డు అంటే ఊరికే రాదు. ప్రపంచంలో ఉన్న చిత్రాలతో పోటీ పడి నెంబర్ వన్ గా అంతర్జాతీయ స్థాయిలో నిలుస్తే ఆస్కార్ దక్కుతుంది.కాని చంద్రబాబు మాత్రం బాహుబళికి ఆస్కార్ అవార్డు వచ్చే విధంగా కేంద్రంతో లాబియింగ్ చేస్తారంట.
ఆ సంగతి పక్కన పెడితే, ఆస్కార్ మేనియా ప్రపంచమంతా వుందన్నది నిర్వివాదాంశం. అలాంటి ఆస్కార్ మన తెలుగు సినిమాకి దక్కితే.. అది నిజంగానే, అరుదైన గౌరవం. అది ‘బాహుబలి’తో దక్కితే అంతకన్నా కావాల్సిందేముంటుంది తెలుగు సినీ పరిశ్రమకి. ఆస్కార్ అవార్డు రావాలంటే కేంద్రం ఆశీసులు ఉండాలా అన్నిది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆస్కార్ పురస్కారం విషయంలో కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకటించేసి అందర్నీ విస్మయానికి గురిచేశారు. బాబు అస్కార్ అవార్డు ఇప్పించేంత మేనియా ఉందాని పినీ ప్రముఖులు గుసగుస లాడుకుంటున్నారు. కేంద్రం సిపార్స్ చేస్తే ఆస్కార్ అవార్డు వస్తుందంటె ఇంతకన్నా కామిడి ఏముంటుంది బాబుగారు.
కేంద్రంతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు మంత్రి పదవులు తెచ్చుకోవడం అంటే తేలికే… ఏదో విధంగా లాబియింగ్ చేసి తెచ్చుకోవచ్చు కానీ… రాష్ట్రానికి రావల్సి ప్రత్యేకహోదా, రైల్వేజో కోసం కేంద్రంతో పోరాడటం చేతకాదుగాని ఆస్కార్ అవార్డుకోసం సిఫార్స్ చేస్తాడంట.. ఇదేం విడ్డూరంని జనాలు నవ్వుకుంటున్నారు. కుమారునికి మంత్రి పదవి ఇప్పించుకున్నంత తేలిక కాదు ఆస్కార్ అవార్డు రావడమంటే. సిఫారసులతో తనక్కావాల్సినవారికి కొన్ని ‘పురస్కారాలు’ జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు ఇప్పించుకోవచ్చుగాక. ఆస్కార్ విషయంలో బాబు ‘పప్పు’లేమీ ఉడకవ్.
మొన్నామధ్య ఒలింపిక్స్ సందర్భంగా, అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించేస్తామని ప్రకటించేశారు చంద్రబాబు. నంది వవార్డులంటే రాష్ట్రస్తాయిలో ఇచ్చేవి కాబట్టి బాబు ఏసినిమాకు సిపార్స్ చేస్తే దానికి ఇవ్వాలి. మరి ఇదేమన్న నంది అవార్డులాంటిదనుకున్నావా బాబు. ‘బాహుబలి’ సినిమాకి ఆస్కార్ కోసం కేంద్రం సిఫారసు చేసేలా ప్రయత్నిస్తామని చంద్రబాబు చెప్పడం చూస్తె అది పెద్దజోకే అవుతుంది.
Related