Monday, May 6, 2024
- Advertisement -

ఆర్టీసీని కేశినేని నానికో, జేసీ దివాకర్ రెడ్డి… మ‌రి సీఎం సీటు లోకేష్‌కా బాబు

- Advertisement -
chandra babu will sell off apsrtc to either kesineni or diwakar reddy says ys jagan-mohan reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి పాలనపై ఏ ఒక్కరూ సంతోషంగా లేరని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాబు పాలన‌తోపాటు ఆయ‌న అనుయాయుల‌మీద జ‌గ‌న్ అదిరిపోయే పంచ్‌లు విసిరారు. గుంటూరు బ‌స్టాండు వ‌ద్ద మేడే ఉత్స‌వాల్లో పాల్గొన్న జ‌గ‌న్ అధికార‌పార్టీకి పంచ్‌ల‌మీద పంచ్‌లు విసిరారు.ప్ర‌భుత్వ సంస్థ‌ల‌ను ప్ర‌యివేటు ప‌రంచేసేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌నీ విమ‌ర్శించారు.

ఆర్టీసీని కేశినేని నానికో, జేసీ దివాకర్ రెడ్డికో అమ్మేసేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారన్నారు. రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లను, కాలేజీలను నారాయణకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విద్యుత్ రంగ సంస్థలను సుజనాచౌదరి, సీఎం రమేష్‌లకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేస్తున్న పనులతో కార్మికులు అభద్రతాభావంతో బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేస్తానని ఎన్నికలకు ముందు చెప్పిన చంద్రబాబు.. ఆ తర్వాత తన సొంత మామకు వెన్నుపోటు పొడిచినట్లే వీళ్లకూ వెన్నుపోటు పొడిచేశారని మండిపడ్డారు.

చంద్రబాబు పాలనలో కార్మికులు, రైతులు చదువుకున్న పిల్లలు ఎవరూ సంతోషంగా లేరని చెప్పారు. అంతా కలిసికట్టుగా ఒక్కటై చంద్రబాబు పాలనకు చరమగీతం పాడాల్సిందిగా పేరు పేరునా కోరుతున్నానన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు వైఎస్ జగన్‌కు తమ కష్టాలపై వినతిపత్రం సమర్పించారు.ఆర్టీసీని కేశినేని నానికో, జేసీ దివాకర్ రెడ్డికి… రేషనలైజేషన్ పేరుతో స్కూళ్లను, కాలేజీలను నారాయణకు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. విద్యుత్ రంగ సంస్థలను సుజనాచౌదరి, సీఎం రమేష్‌లకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు . మ‌రి ప్ర‌భుత్వ ఆస్తుల‌ను త‌న అనుయాకులంద‌రికీ ఇస్తున్న బాబు త‌న కొడుక్కి మాత్రం సీఎం సీటును కానుక‌గా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు చంద్ర‌బాబు.

{youtube} zBR8I__xEzQ{/youtube}

Related

  1. చంద్రబాబు విదేశీ ప‌ర్య‌ట‌న త‌ర్వాతే నిర్ణ‌యం
  2. ముందస్తు ఎన్నికలు ఇప్పట్లో లేవు : వెంకయ్య నాయుడు
  3. నోట్ల‌పై రాత‌లున్నా బ్యాంకులు తీసుకోవాల్సిందే….
  4. చైనా, పాకిస్థాన్‌తో యుద్ధానికి సిద్ధంగా ఉడండి…

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -