- Advertisement -
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడ ప్రసంగం పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. పవన్ కళ్యాణ్ వాస్తవాలే మాట్లాడారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా వస్తే ఎక్కువ సంతోషించేది తానే అని అన్నారు. పవన్ కళ్యాణ్ వాదనని మనం అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు విపక్షాలు వైసిపి తలపెట్టిన బంద్ పై కూడా మాట్లాడారు. విపక్షాలు తలపెట్టిన బంద్ కు ప్రజలు సహకరించొద్దని సూచించారు. రాష్ట్ర విభజన తరువాత ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను మరింత ఇబ్బందికి గురిచేయొద్దని అన్నారు. ఏపీ ప్రత్యేక హోదా సాధనకోసం తానూ రాజీనామా చేస్తానని.. డబ్బులు మీరు తెస్తారా అంటూ ప్రశ్నించారు ?
Related