Friday, May 17, 2024
- Advertisement -

కాకినాడ బహిరంగ సభలో పవన్ స్పీచ్

- Advertisement -

పవన్ స్పీచ్ మొదలు పెడుతునే బీజేపీ మీద మండిపడ్డారు.

మలో పౌరుషం చచ్చిపోయింది అనుకున్నారా అని పవన్ కేంద్రంను ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోద ఇస్తారు అని మోసం చేసారు అని కేంద్రం మీద మండిపడ్డారు.

నాకు పోలిటికల్ బ్యాక్ గ్రాండ్ లేదు.. నేను కేవలం ప్రజల సమస్యల కోసం వచ్చాను. నాకు సినిమాలు ముఖ్యం కాదు.. సినిమాలు వద్దు అంటే ఈ క్షణంమే మానేస్తాను అని చెప్పాడు.

కాంగ్రెస్ వెన్నుపోటు పోడిస్తే.. బిజేపీ పోట్టలో పోడిచింది. గోటితో పోయేదానిని గొడ్డలి వరకు తెచ్చుకున్నారు అని పవన్ అన్నారు

గడ్డం గీసుకునెంట ఇజీగా రాష్ట్రాలను విడదిసారు. కేంద్రం ఏపీ ప్రజలకు రెండు పచిపోయిన లడ్డులను ఇచ్చింది. ప్రత్యేక హోద విషయంలో చాలా మోసం చేసారు.

రాష్ట్రంను విడదీసి ప్రజలను మోసం చేశారు. నన్ను బీజేపి, టీడిపీ లు నడిపిస్తున్నారు అనే విషయంలో సత్యం లేదు. నాకు ఏపీలో సెంటీమెంట్ భూమి లేదు.. నేను కేవలం ఇక్కడకు వచ్చింది ఏపీ ప్రజల కోసమే.

చట్ట సభలో ప్రధాన మంత్రి ఇచ్చిన మాటకు కట్టుబడి ఎందుకు లేరు అని పవన్ ప్రశ్నించారు.

అధికరంలో ఉన్న మంత్రులు వారు ప్రజలను పట్టించుకోవడం లేదు.. అందుకే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.

రాష్ట్రం విడగోట్టిన విషయం తెలియాగానే.. నేను 11 రోజులు అన్నం తీనలేదు. నేను ఉత్తరాది అహకారం మీదే నా పోరాటం.

మనకు గుండలు అవసరం లేదు.. మనకు డబ్బు అవసరం లేదు.. మనకు భగవంతుడు ఉన్నాడు.

వెంకయ్య నాయుడు ఆనాడు అర్ధం అయ్యే భాషలో మాట్లాడి.. ఇప్పుడు ప్రత్యేక హోద గురించి అడిగితే అర్ధం కాని భాషలో మాట్లాడుతున్నారు అని పవన్ అన్నారు.

ప్రత్యేక హోద విషయంలో అధికారులు, ప్రతిపక్ష నేతలు ఏం చేయకపోతే.. మీము రోడుకెక్కుతాం అని పవన్ అన్నారు.

కేంద్రం ఇప్పుడైనా ప్రత్యేక హోద ఇస్తారా.. లేదా అనేది స్పష్టంగా చెప్పాలి అని పవన్ ప్రశ్నించారు. అలాగే వెంకయ్య నాడు ప్రత్యేక హోద విషయంలో పోరాటం చేయాలి అని పవన్ అన్నారు.

ఏపీ సీమంద్ర నేతలు తెలంగాణకు మోసం చేశారు. ప్రజరాజం ప్రచారం టైంలో తెలంగాణలో నన్ను తిట్టారు.

ప్రత్యేక హోద విషయంలో కేంద్ర వెనక అడుగు వెస్తున్నారు.. గట్టిగా అడిగితే… రాజ్యాంగం ఒప్పుకోవడం లేదు అని అంటున్నారు.

ప్రత్యేక హోద విషయంలో పోరాటం చేయాల్సింది విద్యార్ధులు కాదు.. మంత్రులు, ప్రజనాయాకులు రోడ్లపైకి వచ్చి పోరటం చేయాలి.

ఎంపీలు కారం తిని పౌరుషం తెచ్చుకోవాలి.. ఇప్పుడైనా ప్రత్యేక హోద గురించి అలోచించాలి. 

రేపు బందులో మీరు పాలుగొటారో లేదో తెలియాదు అది మీ ఇష్టం.. కానీ విద్యార్ధులు చదువుకోండి.. బందులో పాలుగోనాల్సింది ప్రజనాయాకులు.

ప్రభుత్వ అధికారుల సమస్యలను ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.. నిధులను కేవలం రాజదాని కోసం మాత్రమే ఖర్చు పెడుతున్నారు.

బిజేపీ తప్పు దిద్దుకోకపోతే.. రాబోయే రెండేళ్లలో బిజేపికి ముప్పుతిప్పలు పెట్టగలను అని పవన్ అన్నారు.

మీకు దమ్ము ఉంటే రాజీనామా చేయండి.. ప్రత్యేక హోద విషయంపై క్లారిటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పవన్ అన్నారు.

భారత్ మాతాకీ జై నినాదంతో సభను ముగించిన పవన్ కళ్యాణ్.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -