Saturday, May 18, 2024
- Advertisement -

ఖ‌రీదైన కూలీ కేటీఆర్

- Advertisement -
KTR Hand Made Ice Cream fetches Rs 5 Lakh

కూలీల్లో క‌రీదైన కూలీ వింటే ఆశ్చ‌ర్యంగా ఉదా! ఖ‌రీదైన కూలీ ఏంటీ అనుకుంటున్నారా! మీరు విన్న‌ది నిజ‌మే నండోయ్‌. కూలీ  ఒక రోజు ప‌ని చేస్తే సంపాదించేది మ‌హా అంటె రెండు లేదా మూడు  మూడు వంద‌ల రూయాలు. అంత‌కంటే సంపాద‌న ఉండ‌దు.మ‌రీ ఈఖ‌రీదైన ఒక రోజు కీలీ ఎంతో తెలుసా.అక్ష‌రాలా రూ.7.30ల‌క్ష‌లు.  ఏంటా మహత్యం ! అనుకుంటున్నారా! అవును మీరు వింటున్న‌ది నిజ‌మే.

ఆకూలీ ఎవ‌రో కాదు సీఎం కేసీఆర్ కొడుకు కేటీఆర్‌. సీఎం కొడుకు ఏంటి కూలీ అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చ‌ద‌వండి. ఈనెల 27 వ‌తేదీనీ  పార్టీ ప్లీన‌రీ స‌భ నిర్వ‌హిస్తోంది. ఈ స‌భ‌ను క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో నిర్వ‌హించాల‌నీ ఇప్ప‌టికే  సీఎం కేసీర్   పార్టీ శ్రేనుల‌ను ఆదేశించారు. ఈస‌భ‌కు అయ్యే ఖ‌ర్చు భ‌రించాలంటే చిన్న విష‌యం కాదు. అందుకే కేసీఆర్ కూలీప‌నిని తెర‌మీద‌ర‌కు తీసుకొచ్చారు. బ‌హిరంగ స‌భ‌కు వ‌చ్చే  కార్య‌క‌ర్త‌లు,పార్టీ శ్రేనులు ఎవ‌రి సొంత ఖ‌ర్చులు వారే పెట్టుకోవాల‌నీ దీనికోసం కూలీ ప‌ని చేసి సంపాదించు కోవాల‌న్నారు.

ఈనెల 14 నుంచి 20 వ‌ర‌కు గులాబీ కూలీ దినాలుగా పాటించ నున్న‌ట్లు కేసీఆర్ ప్ర‌క‌టించిందే త‌డువుగా  నాయ‌కులు రంగంలోకి దిగారు. అన్నింటిలో ముందుండే  కేటీఆర్ 25 అయిదు నిమిషాల్లో 7.30 లక్షలు సంపాదించారు. టీఆర్ ఎస్ కూలీ దినాల్లో భాగంగా  కొంపల్లిలోని ఓ ఐస్ క్రీమ్ పార్లర్ లో కేటీఆర్ ఐస్ క్రీమ్ అమ్మి లక్షా 30 వేల రూపాయలు సంపాదించారు. ఒక ఐస్ క్రీమ్ కు ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు కొనగా  స్థానిక నేత శ్రీనివాస్ రెడ్డి మరో ఐస్ క్రీమ్ కు రూ.లక్ష చెల్లించారు. అలాగే కేటీఆర్ స్వయంగా జ్యూస్ అమ్మారు. ఈ విషయాన్ని ఎంపీ మల్లారెడ్డి మీడియాకు వివరించారు. అనంతరం కుత్బుల్లాపూర్ లో కేటీఆర్ జ్యూస్ – ఐస్ క్రీమ్ అమ్మారు. ఓ భవన నిర్మాణంలో కాసేపు ఇంజినీర్ గా పనిచేశారు.కేటీఆర్ మొద‌టి రోజే రూ 7.30 ల‌క్ష‌లు సంపాదించారు మ‌రి. సాధార‌న కూలీ సంపాదించాలంటే సంవ‌త్స‌రాలు ప‌డుతుంది.  అదండి మ‌న ఖ‌రీదైన కీటీఆర్ కూలీ స్టోరీ.

Related

  1. నైట్‌పార్టీలు-రేవ్ పార్టీల‌ను నిషేదించే దిశ‌గా గోవా స‌ర్కార్‌
  2. కుల‌భ‌కూష‌న్ జాదవ్ ఆరిపై అప్పీలు చేసుకోవ‌చ్చ‌న్న పాక్‌.
  3. బ‌య‌ట‌కు రావాలంటే బెంబేలెత్తుతున్న ప్ర‌జ‌లు
  4. సాక్షి చదవొద్దు అని చెబుతాడు కానీ బాబు మాత్రం చదువుతాడు 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -