Monday, May 5, 2025
- Advertisement -

ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలు ప్రభుత్వం ఒప్పుకుంటే త్వరలో అందుబాటులోకి రానున్నాయి.

- Advertisement -
check to explode with plastic cylinders

గ్యాస్‌ సిలిండ‌ర్ల రాక‌తో దేశంలోని మ‌హిళ‌ల్లో చాలా మార్పులు వ‌చ్చాయి. పొగ నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించ‌డంతోపాటు..స‌మ‌యం కూడా ఆదా అవుతుంది. అయితే ప్ర‌మాదాలుకూడా ఎక్కువే. ఏదైనా గ్యాస్ సిలిండ‌ర్ పేలితే ప్రాణ‌న‌ష్టంతోపాటు ఆస్తి న‌ష్టం అపారంగా ఉంటుంది

.ఇలాంటి ప్ర‌మాదాలు చాలానే చూశాం. కానీ ఇక నుంచి ఇళ్లలో చాలావరకు ప్రమాదకరం కాని ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లు రానున్నాయి.
బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఇండోగ్యాస్‌ సంస్థ ప్లాస్టిక్ సిలిండ‌ర్ల‌ను అభివృద్ధి చేసింది. సిలిండర్‌లో మొదట హైడెన్సిటీ పాలిమర్‌ ఎథీన్‌తో కవచం చేసి దానిపై గ్లాస్‌ ఫైబర్‌ వైండింగ్‌ ద్వారా మరో కవచంతో తయారైన సిలిండర్‌కు మరికొన్ని రసాయనాలు కలిపి వేర్వేరు ఉష్ణోగ్రతల వద్ద దశలవారీగా వేడి చేసి దృఢంగా రూపొందించారు. సిలిండర్లను గుజరా త్‌లోని పంచమహల్‌ జిల్లా చంద్రాపురం లోని మరో కంపెనీలో ప్రస్తుతం తయా రు చేస్తున్నారు. వీటిలో 5, 10, 12, 15 కిలోల పరిమాణంలో తయారవుతున్నాయి. అన్ని పరీక్షలు ముగిసిన తర్వాత ఈ సిలిండర్లు త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి.
ప్రస్తుత సిలిండర్లు బ‌ల‌మైన ఉక్కుతో త‌యారు కావ‌డంవ‌ల్ల లోపల పీడనం ఎక్కువైన ప్పుడు అందులోని గ్యాస్‌ ఒక్కసారిగా బయటికి చొచ్చుకొస్తుంది. గ్యాస్‌ను బంధించి ఉంచిన లోహం దీన్ని అడ్డు కోవడంతో పేలుడు సంభవిస్తుంది. ప్లాస్టిక్‌ సిలిండర్ల తయారీలో వాడిన పదార్థాలు, చేసిన విధానం వల్ల దాని లోపల ఎక్కువ వేడి లేదా పీడనం ఏర్పడినప్పుడు లోపలి కవచాలు కరిగి పోవడంమొదలవుతుంది. దీంతో గ్యాస్‌ బయటికి వస్తుందే తప్ప పేలుడు సంభ వించదని సంస్థ ప్రతినిధులు తెలిపారు.
వీటి సామర్థ్యం పరిశీలించాల్సిందిగా అన్ని ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలకు తయారీ సంస్థ ఈ సిలిండర్లను అందజేసింది. అమెరికా, దక్షిణ కొరియా లాంటి దేశాల్లో వీటిని వాడుతున్నారు. ప్రభుత్వ ఎల్పీజీ సంస్థలు ప్రభుత్వం ఒప్పుకుంటే త్వరలో మన ఇళ్లలో ఈ ప్లాస్టిక్ గ్యాస్ సిలిండర్లు దర్శనమివ్వనున్నాయి.

Related

  1. 1500 వంద‌ల‌కే స్మార్ట్ పోన్‌…
  2. ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ భారీ షాక్‌…
  3. త్వ‌ర‌లో హైప‌ర్‌లూప్ ట్రైన్‌
  4. ఇది ఉంటే చాలు…గాలి, నీటితో చార‌జింగ్ చేసుకోవ‌చ్చు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -