Sunday, May 12, 2024
- Advertisement -

ఇది ఉంటే చాలు…గాలి, నీటితో చార‌జింగ్ చేసుకోవ‌చ్చు

- Advertisement -
Water Lily Cell Charger

ప్ర‌స్తుతం ప్ర‌పంచం అంతా టెక్నాల‌జీ మ‌యం. 24 గంట‌లూ ఇంట‌ర్నెట్. నెట్‌కూడా కుటుంబాల్లో ఒక‌ట‌య్యింది. ఎక్క‌డికెల్లినా ఇంట‌ర్నెట్‌కు బానిస‌లు. ప్రస్తుత కాలంలో తినడానికి తిండి ఉన్నా లేకున్నా ఫర్వాలేదు కానీ…స్మార్ట్‌ ఫోన్‌ లో చార్జింగ్‌ లేకపోతే మాత్రం క్షణం గడవడం కష్టంగా మారింది.

స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇంకో వ్యక్తితో పని లేదు. పదిమందిలో ఉన్నా స్మార్ట్ ఫోన్ తోనే జీవితాన్ని గడిపేసే వారు ఎంతో మంది ఉన్నారు. ఎంత వ‌ర‌కంటే ఉద‌యం బ‌య‌ట‌కు వెల్లినప్ప‌టినుంచి ఇంటిఇ వ‌చ్చి నిద్ర‌పోయే వ‌ర‌కు దీనికి బానిస‌లే.

ఎవ‌రితోనైనా మాట్లాడేటప్పుడు చుర్జింగ్ అయిపోతే చాలు తీవ్ర అస‌హ‌నానికి గుర‌వుతారు. వారి స్మార్ట్ ఫోన్ దాహం తీర్చేందుకు డ్యుయల్ బ్యాటరీలు, పవర్ బ్యాంక్ ఇలా ఎన్నో పరికరాలు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే అవి అందులో పవర్ ఉన్నంత వరకు మాత్రమే పని చేస్తాయని, ఓకంపెనీ తయారు చేసిన పరికరం బ్యాగులో ఉంటే చాలు సెల్ ఫోన్ లో చార్జింగ్ లేదనే మాట ఉండదని కెనడాకు చెందిన సీఫార్మిటిక్స్ అనే సంస్థ చెబుతోంది.
వాటర్ లిలీ అంటే ముద్దుగా పిలిచే ఈ పరికరం ప్రత్యేకత ఏంటంటే…వీచే గాలి, పారే నీటితో విద్యుత్ ను తయారు చేసి, బ్యాటరీ ఫుల్ చేయడం. ఇది బ్యాగులో ఇమిడేంత చిన్న పరికరమే. బరువు 800 గ్రాములకు మించకుండా ఉంటుందని ఆ సంస్థ పేర్కొంటోంది. ఇది చాలా నెమ్మదిగా పారే నీటిలో కూడా 25వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, అలాగే దీనితో బైక్ పై సుమారు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా చెక్కు చెదరదని, విద్యుత్ ను ఉత్పత్తి చేస్తుందని ఆ సంస్థ తెలిపింది. మరో మూడు నెలల్లో అందుబాటులోకి రానుంది. దీని ధర సుమారు రూ. 7 వేల వరకు ఉంటుందని అంచనా.మొబైల్ ప్రియుల‌కు ఇక శుభ‌వార్తే.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. స‌ముద్రం మీద కూర‌గాయ‌ల సాగు.
  2. విమానంలాగా గాల్లో ఎగిరే కార్లు…
  3. వ‌చ్చే జ‌న్మ‌లో మీరు ఏజీవిగా పుర్తారో తెలుసుకోండి.
  4. పుట్టిన తేదీని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -