Sunday, April 28, 2024
- Advertisement -

1500 వంద‌ల‌కే స్మార్ట్ పోన్‌…

- Advertisement -
Jio 4g Feature Phone With Rs 1500 Price Could Be Real Soon

అత్యాధునిక టెక్నాల‌జీ వ‌చ్చిన త‌ర్వాత ప్ర‌పంచ స్వ‌రూప‌మే మారిపోయింది. ఇంట‌ర్నెట్ ప్ర‌తీ ఒక్క‌రికీ అందుబాటులోకి వ‌చ్చింది.ఇక సెల్ పోన్ల‌గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రోజుకో కొత్త పీచ‌ర్ల‌తో స్మార్ట్ పోన్‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి.ఇప్ప‌టికే దేశంలో స్మార్ట్ పోన్‌ల వినియేగం విస్త్రుతంగా పెర‌గుతోంది. కంపెనీల మ‌ధ్య పోటీ త‌త్వం పెర‌గ‌డంతో మా రుతున్న టెక్నాలజీకి అనుగునంగా త‌క్కువ ఖ‌ర్చుకే పోటీ స్మార్ట్ పోన్ల‌ను అందిస్తున్నాయి.

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల విస్తృతి పెరుగుతూ వస్తోంది. వినియోగదారులకు మరింత చేరువయ్యేందుకు మొబైల్‌ తయారీ సంస్థలు సైతం ధరలను తగ్గిస్తున్నాయి. దీంతో అధునాతన ఫీచర్లు కలిగిన ఫోన్లు రూ.10వేలలోపే లభిస్తున్నాయి. త్వరలోనే బేసిక్‌ ఫోన్ల ధరకే స్మార్ట్‌ఫోన్లు లభించే సమయం రానుంది. చైనాకు చెందిన మొబైల్‌ చిప్‌ తయారీ సంస్థ స్ప్రెడ్‌ట్రమ్‌ కమ్యూనికేషన్‌ ఇందుకు ప్రణాళిక రచిస్తోంది. ప్రస్తుతం కొన్ని ఫోన్‌ తయారీ సంస్థలు అందిస్తున్న ధరలకన్నా సగం ధరకే 4జీ సదుపాయంతో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ తీసుకురావాలని యోచిస్తోంది.

అంద‌రికీ అందుబాటు రేటులో రూ.1500లకే 4జీ సదుపాయంతో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చేందుకు ప్ర‌ణాలిక‌ల‌ను సిద్దం చేస్తోంది కంపెనీ. మా భాగస్వాములతో కలిసి ఈ మేరకు కార్యాచరణ ప్రారంభించాం’ అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్ప్రెడ్‌టర్మ్‌ భారత్‌ ఉన్నతాధికారి నీరజ్‌ శర్మ తెలిపారు. ఇప్పటికే దేశీయ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్‌లు రూ.3వేల స్థాయిలో 4జీ సదుపాయం కలిగిన ఫోన్లను విక్రయిస్తున్నాయి. కార్బన్‌ కూడా తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లను అందించాలని యోచిస్తోంది.

దేశంలో సంచ‌ల‌నం సృష్టిస్తున్న రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ప్రధానంగా 4జీ సేవలను అందిస్తోంది. ఈ నేపథ్యంలో జియో కూడా రూ.1500లకే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. కంపెనీల మ‌ధ్య పోటీత‌త్వం పెరిగి స్మార్ట్ పోన్‌ల ధ‌ర‌లు ప్ర‌తీ ఒక్క‌రికి అందుబాటులోకి రానున్నాయి.

Related

  1. రిలయన్స్ మరో సూపర్ ఆఫర్.. 148 కి 70 జీబీ
  2. జియో సూపర్ ఆఫర్ : 810 జీబీ డేటా ఇస్తుంది
  3. 8th క్లాస్ కుర్రాడు.. 15 ఏళ్ళ బాలికను తల్లి చేసాడు.. చివరికి ఏమైయింది..?
  4. షాకింగ్ ఆఫర్ : కేవలం రూ. 73కే అన్‌లిమిటెడ్ డేటా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -