Wednesday, May 7, 2025
- Advertisement -

సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన.. ఒక్కొకరి అకౌంట్ కి 4 వేలు..

- Advertisement -
cm kcr deposit 4 thousand rupess in bank accounts

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. రైతు రుణాల మాఫీ ఎన్నికల హామీని నెరవేర్చారు.. ఈ క్రమంలో మరోసారి రైతులకు వరాలు కురిపిస్తూ సంచలన విషయాలు తెలిపారు. రైతులకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుండి ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని తెలిపారు.

అలానే ప్రతి ఒక్క గ్రామంలో రైతు సంఘం ఏర్పాడు చేసుకోవాలని.. మే 30 లోపు ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున రైతుల ఎకౌంట్ లో వేస్తామని తెలంగాణ సీఎం.. కేసీఆర్ ప్రకటించారు. గురువారం ప్రగతి భవన్ లో రైతులతో సీఎం కేసీఆర్ ముఖాముఖి సమావేశమయ్యారు. ఎన్నికల హామీ మేరకు రైతు రుణాలను (రూ.లక్ష లోపు) పూర్తిగా మాఫీ చేసినందుకు రైతులు కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా 17 వేల కోట్ల రూపాయల రైతు రుణాలను మాఫీ చేశామని చెప్పారు. తెలంగాణలో ఇక నుంచి విద్యుత్ కోతలు ఉండవని చెప్పారు. మూడు, నాలుగేళ్లలో కోటి ఎకరాలకు గోదావరి నీరు అందిస్తామన్నారు. మేడిగడ్డ నుంచి శ్రీరాంసాగర్ కు నీళ్లు మళ్లిస్తామని కేసీఆర్ తెలిపారు.

Related

  1. బాబుకు కేంద్ర ఝుల‌క్‌….పోల‌వ‌రం అంచ‌నాలు పెరిగితే రాష్ట్ర‌మే భ‌రించాల‌న్న కేంద్రం
  2. వైకాపా నుంచి కొమ్మినేనికి ఊహించని బంపర్ ఆఫర్
  3. ఎన్టీఆర్ సినిమాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి??
  4. చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌ద‌రంగంలో అఖిల ప్రియ పావేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -