Thursday, May 9, 2024
- Advertisement -

చంద్ర‌బాబు రాజ‌కీయ చ‌ద‌రంగంలో అఖిల ప్రియ పావేనా?

- Advertisement -
akhila priya political life

భూమా అఖిల ప్రియ రాజ‌కీయ భ‌విష్య‌త్తు అగ‌మ్య‌గోచ‌రంగా త‌యార‌య్యిందా! బాబు అడుతున్న రాజ‌కీయ చ‌ద‌రంగంలో ఓభాగ‌మా?ప‌్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిస్తితులు చూస్తుంటే అవున‌నే అంటున్నాయి.అఖిలప్రియ రాజకీయ ప్రస్థానాన్ని మనం ఇక్కడ స్పష్టంగా గమనించవచ్చు. తల్లి చనిపోతే ఈమె ఎమ్మెల్యే అయింది. తండ్రి చనిపోతే మంత్రి పదవి లభించింది.ఇక్క‌డే బాబు రాజ‌కీయ మార్క్ చూపించారు.ఖాలీ అయిన నంద్యాల నియేజ‌క వ‌ర్గానికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో త‌ల‌పండిన రాజ‌కీయ నాకుల‌కుకాకుండా ఏమాత్రం రాజ‌కీయ అనుభ‌వంలేని అఖిల ప్రియ‌కు రాష్ట్ర క్యాబినేట్లో చోటుక‌ల్పించారు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.

క్యాబినేట్లో  అతి పిన్న‌వ‌య‌స్కురాలుగా అఖిల ప్రియ‌ మంత్రి ప‌ద‌విని చేప‌ట్టారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కాబినెట్ లో చోటు సంపాదించుకున్నా ప్రస్తుతం ఆమె రాజకీయాల్లో ఒంటరిగానే మిగిలిపోయింద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. ఇక  రాజ‌కీయంగా నిల‌దొక్కుకొనేందుకు ఏమాత్రం స‌హ‌క‌రించ‌ని శాఖ‌ను కేటాయించారు. అదికూడా త్వ‌ర‌లో జ‌రిగే నంద్యాల ఉప ఎన్నలిక‌కోస‌మే మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్యం.ఉపెన్నిక‌ను ప్ర‌తీస్టాత్మ‌కంగా తీసుకున్న బాబు  అక్క‌డ గెల‌వాలంటే సెంటీమెంటుత‌ప్ప మ‌రోమార్గం టీడీపీకీ క‌నిపించ‌డంలేదు.అందుకే అఖిల‌ప్రియ‌కు మంత్రిప‌ద‌విని క‌ట్ట‌బెట్టి సెంటీమెంటునే ఆయుధంగా  ఉప‌యేగించుకున్నార‌న్న‌ది రాజ‌కీయ వ‌ర్గాల విశ్లేష‌న‌. మంత్రి వ‌ర్గంలో ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి.. రాజకీయంగా  అనుభ‌వ‌మున్న వ్య‌క్తే  బాబు రాజ‌కీయంముందు ఏమిచేయ‌లేక‌పోతున్నారు తట్టుకోలేకపోతున్నాడు. తన శాఖలో చెంచాను కూడా కదిలించలేని స్థితిలో ఉన్నాడు. అలాంటి వాతావరణం మధ్య అఖిలప్రియ మంత్రిగా నిలదొక్కుకుంటుందని, కనీసం తన ప్రాపకాన్ని అయినా నిలబెట్టుకుంటుందని అనుకోవడానికి మించిన అపోహ ఇంకోటి లేదు.

ఆమెకోల్పోయిన వాటి ముందు మంత్రిప‌ద‌వి గడ్డిపోచ‌తో స‌మానం. తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన అఖిల‌ప్రియ విష‌యంలో సామాన్యజనాలకు అఖిలపై జాలి ఉంటుంది కానీ.. రాజకీయానికి కాదు. మరి ఆ రాజకీయాన్ని ఎదుర్కొనడానికి తగిన వయసు కానీ, అనుభవం కానీ, బలగం కానీ.. అఖిలప్రియకు లేవు పాపం. మంత్రి ప‌ద‌వి కూడా చాలా తాత్కాలిక కాలమైన పదవి. మంత్రి ప‌ద‌వి కూడా  అఖిలప్రియ రాజకీయ భవిష్యత్తు కేవలం ఆళ్లగడ్డ నియోజకవర్గం ప్రజలు ఆమె మీద చూపే సానుభూతి మీదే ఆధారపడి ఉంది. నంద్యాల నియోజకవర్గాన్ని ఎలాగూ భూమా ఫ్యామిలీ మరిచిపోవాల్సిందే ఇక. తెలుగుదేశం పార్టీ ఆ మేరకు స్కెచ్‌ వేసిందనే మాట వినిపిస్తోంది. వచ్చే ఎన్నికలకు ఎలాగూ టీడీపీకి ఆళ్లగడ్డలో ప్రత్యామ్నాయం లేదు కాబట్టి.. అఖిలకు అవకాశం దక్కుతుంది. అప్పటి వరకూ అక్కడ తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఈమెపై ఉండే సానుభూతి మీదే భవితవ్యం ఆధారపడి ఉంది. నంద్యాల ఉప ఎన్నికతోనే రాజ‌కీయ భ‌విష్య‌త్తుతేలిపోనుంది.అన్నీ చూస్తుంటే బాబు రాజ‌కీయ చ‌తుర‌త మందు త‌ల‌పండిన నాయ‌కులే కిందామీద‌ప‌డుతుంటే ఎలాంటి రాజ‌కీయ అనుభ‌వంలేని అఖిలప్రియ ఎంత‌.అందుకే నంద్యాల ఉప ఎన్నిక‌ను దృష్టిలో పెట్టుకొని అఖిల‌ప్రియ‌కు మంత్రిప‌ద‌విఇచ్చిబాబు కూర‌లో క‌రివేపాకులాగా వాడుకుంటున్నార‌న్న‌దీ అంద‌రినోట వినిపిస్తున్న మాట‌.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -