Thursday, May 2, 2024
- Advertisement -

బాబుకు కేంద్ర ఝుల‌క్‌….పోల‌వ‌రం అంచ‌నాలు పెరిగితే రాష్ట్ర‌మే భ‌రించాల‌న్న కేంద్రం

- Advertisement -
central government shock to chandrababu

పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్రం మ‌రోబాంబు పేల్చింది. ఇన్నాల్లు ప్రాజెక్టు వ్య‌యాన్ని కేంద్ర‌మే భ‌రిస్తాద‌న్న చంద్ర‌బాబు అంచ‌నాలు త‌ల‌కిందుల‌య్యాయి. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగితే.. దాన్ని ఏపీ రాష్ట్రమే భరించాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. సోమవారం రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు మంత్రి ఉమాభారతి సమాధానమిస్తూ.. ఏప్రిల్ 2014 నాటి ధరల ప్రకారం సాగునీటి నిర్మాణ అంచనా వ్యయం పెరిగితే.. ఈ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని ఉమాభారతి స్పష్టం చేశారు. ఇన్నాల్లు పోల‌వ‌రానికి సంబంధించిన ఖ‌ర్చు కేంద్ర‌మే భ‌రిస్తుంద‌నీ …. గంపెడాశ‌లు పెట్టుకున్న   బాబు  ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి.

ఏపీ విభజన చట్టం ప్రకారం పోలవరం నిర్మాణ బాధ్యతలను కేంద్రానికే అప్పగించి ఉంటే ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చి ఉండేది. ప్రాజెక్టు నిర్మాణ బాధ్య‌త‌ల్ని రాష్ట్రానికి ఇవ్వాల‌నీ కేంద్రానికి విన్న‌వించ‌డంతో మోదీ స‌ర్కార్ అందుకు ఒప్పుకుంది. ఇదిలా ఉంటే.. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని పెంచుతూ ప్రతీ ఏటా ధరల పెరుగుదల వల్ల 2019నాటికి ఈ అంచనా వ్యయం రూ.42వేల కోట్లకు చేరుకుంటుందని చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. అయితే కమిషన్ల కక్కుర్తితోనే ఆ పని చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఓపక్క పోలవరం నిర్మాణాన్ని 2019 నాటికి ముందే పూర్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెబుతున్నా.. అందుకు తగ్గట్లుగా బడ్జెట్ కేటాయింపులు చేయ‌క‌పోవ‌డం   గమనార్హం. రోజులు గడుస్తున్నకొద్దీ పెరిగే అంచనా వ్యయం.. చివరకు ఏపీ సర్కారుకే చుట్టుకుంటుందన్న చేదు నిజాన్ని తాజాగా కేంద్రమంత్రి స్పష్టం చేశారని చెప్పాలి. 

తాజాగా ఉమాభారతి చెప్పిన మాట ప్రకారం చూస్తే.. పోలవరం ప్రాజెక్టు.. ఏపీ మీద మరింత భారం మోపుతుందని చెప్పక తప్పదు. పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రాజెక్టుగా వారికే నిర్మాణ బాధ్యతలు అప్పగించి..రాష్ట్ర‌ప్ర‌భుత్వానికి ఎటువంటి ఇబ్బందుల ఉండేవి కావు.  బాబు నిర్వాకం వ‌ల్ల పోల‌వ‌రం ప్రాజెక్టు ఖ‌ర్చు బాబు స‌ర్కార్ మెడ‌కు చుట్టుకుంది.దీంతో ప్ర‌భుత్వంపై మ‌రింత భారం ప‌డ‌నుంది.

పోల‌వ‌రం ప్రాజెక్టును వ్య‌యాన్నికేంద్ర‌మే భ‌రిస్తాద‌నీ గొప్ప‌లు చెప్పుకున్న బాబుకు కేంద్ర మాట గొంతులో ప‌చ్చివెలక్కాయ ప‌డ్డ‌ట్టు అయ్యింది.కాంట్రుల‌క్టుల‌కు మేలు చేయ‌డంకోస‌మే ప్రాజెక్టును  రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టింద‌ని ప్ర‌తిప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌ను బాబు అండ్ కో ఏనాడు ప‌ట్టించుకోలేదు…పైగా పోల‌వ‌రం ప్రాజెక్టును అనుకున్న  స‌మ‌యానికి పూర్తి చేస్తామ‌ని….దానికి కేంద్రం అన్ని విధాలుగా స‌హాయం అందిస్తుంద‌నీ గొప్ప‌లు చెప్పుకున్నారు.అస‌లు ప్ర‌తిప‌క్షాల మాట‌ల్ని ఏనాడు ప‌ట్టించుకోలేదు.మ‌రి ఇప్పుడు కేంద్రం మాట‌తో ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు బాబు టీం ఏవిధంగా స‌మాధాన మిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -