పవన్ పొలిటిక‌ల్ కేరీర్‌ నడిపిస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా..?

do you know who the director of pawan political career

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో జ‌న‌సేన ద్వారా పోటీకి దిగ‌నున్నారు. ఇప్ప‌టికే ప‌వ‌న్ ఎన్నిక‌ల బ‌రిలో ఉంటానని ప్ర‌క‌టించారు. పవన్ కూడా ఎన్నికలో పోటీ చేయడంతో 2019 లో వచ్చే ఎన్నికలు ఆసక్తిక‌రంగా మార‌నున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ ఉన్న ద్విముఖ పోటీ కాస్తా ప‌వ‌న్ ఎంట్రీతో అది త్రిముఖ పోరుగా మారిపోయింది.

ఈ విషయం ఇలా ఉంటే.. పవన్ పొలిటిక‌ల్ కేరీర్‌కు ఓ టాప్ డైరెక్ట‌ర్ దర్శకత్వం వహిస్తున్నాడా అంటే..? అవును అనే జవాబులు వస్తున్నాయి ఇండ‌స్ట్రీ నుండి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్నేహం గురించి అందరికీ తెలిసిందే. గ‌తంలో వీరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన జ‌ల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరీసారు వీరి కాంబోలో మరీ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై ఆసక్తికర వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి.

పవన్ ఏపీలో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై వ‌రుస‌గా స్పందిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ కథ పొలిటిక‌ల్ యాక్ష‌న్ మూవీగా ఉండనుందని తెలుస్తోంది. ఈ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటిక్ కేరీర్‌కు కూడా త్రివిక్రమ్ శ్రీనివాసే దర్శకుడిగా ఉంటాడ‌ని తెలుస్తోంది. త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో పవన్ పొలిటిక‌ల్ ప్ర‌సంగాలు, టాఫిక్‌లు ఉంటాయ‌న్న టాక్ కూడా ఇండ‌స్ట్రీలో వినిపిస్తోంది. పవన్ చిత్రం తర్వాత త్రివిక్ర‌మ్ ఎన్నిక‌ల టైంలో కాస్త గ్యాప్ తీసుకుని జ‌న‌సేన కోస‌మే తెర‌వెన‌క ప‌ని చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.

Related

  1. నాగబాబు, పవన్ ల గురించి నిజాలు చెప్పిన చిరు!
  2. పవన్ ఫ్యాన్స్ పై చిరు ఫైర్.. ఎందుకో తెలుసా..?
  3. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్!
  4. పవన్ సరసన యాంకర్ అనసూయ!