Sunday, May 12, 2024
- Advertisement -

15 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్‌…!

- Advertisement -
15 year old record break the megastar

పదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ చేసిన సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమాతో మరోసారి తానకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా పలు రికార్డులను తన ఖాతలో వేసుకుంటుంది. దాదాపు పదిహేనేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఒక రికార్డును మెగాస్టార్ చిరు దాటేశాడు.

గత రికార్డు కూడా చిరుదే కావడం విశేషం. మెగాస్టార్ చిరు – బి.గోపాల్ కాంబినేష‌న్‌లో 2002లో వ‌చ్చిన ఇంద్ర సిత్రం తూర్పు గోదావరి జిల్లా తునిలో 18 లక్షల షేర్ కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. ప్ర‌స్తుతం ఉన్న టిక్కెట్ల రేట్లు అప్ప‌ట్లో ఉన్న రేట్లు పోల్చుకుంటే చాలా త‌క్కువ ఉన్నా ఈ 15 ఏళ్ల‌లో ఇంద్ర రికార్డును మాత్రం ఏ చిత్రం బీట్ చేయలేకపోయింది. బాహుబ‌లి చిత్రం కూడా ఇంద్ర‌ను బీట్ చేయ‌లేదు. ఆ రోజుల్లోనే 18 లక్షలంటే అది మామూలు విషయం కాదు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీ ఖైదీ నెంబ‌ర్ 150 11వ రోజుకు 18.74 లక్షల షేర్ వసూలు చేసి ఇంద్ర రికార్డును బద్దలు కొట్టింది. బాస్ ఈజ్ బ్యాక్ అనే మాటకు మరింత న్యాయం చేకూర్చిన రికార్డిది. వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని రామ్ చరణ్ నిర్మించారు.

Related

  1. ఫ‌స్ట్ వీక్ లో ఖైదీ వసూళ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే!
  2. మురుగదాస్ కి ఖైదీ సినిమా ఎందుకు నచ్చలేదంటే..?
  3. ఖైదీ నంబర్ 150 ఫస్ట్‌డే కలెక్షన్స్‌ తెలిస్తే షాక్ అవుతారు!
  4. ఖైదీ సినిమాపై రివ్యూ తెలిపిన రాజముళి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -