Saturday, June 1, 2024
- Advertisement -

కుల‌భ‌కూష‌న్ జాదవ్ ఆరిపై అప్పీలు చేసుకోవ‌చ్చ‌న్న పాక్‌.

- Advertisement -
Sushma Swaraj to Pakistan

భార‌త మాజీ నేవీ అధికారి కుల‌భూష‌న్   జాద‌వ్ కు పాకిస్థాన్ మ‌ర‌ణ‌శిక్ష విధించ‌డంపై గ‌త రెండు రోజులుగా భార‌త్‌,పాక్ మ‌ధ్య మాట‌ల యుధ్దం కొన‌సాగింది.పాక్‌లోని బ‌లూచిస్థాన్‌,క‌రాచీలో  విద్రోహ చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నార‌నీ ఆరోపిస్తూ పాక్ మిల‌ట‌రీకోర్టు మ‌ర‌ణ‌శిఖ విధించిన సంగ‌తి తెలిసిందే.

దీనిపై భార‌త్ కూడా ఘాటుగా స్పందించింది.పాక్‌ జాదవ్‌ను ఉరి తీస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్‌ తీవ్రంగా హెచ్చరించింది. తీవ్ర చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్రంగా హెచ్చరించారు. స‌రైన ఆధారాలు లేకుండా ఉరిశిక్ష‌ను ఎలా విధిస్తార‌నీ ప్ర‌శ్నించింది.అయితే పాకిస్తాన్ కూడా అంతే తీవ్ర‌స్తాయిలో ప్ర‌తిస్పందించింది.భార‌త్ తీసుకొనే ఏచ‌ర్య‌నైనా ఎదుర్కొనేందుకు సిధ్దంగా ఉన్నామ‌ని పాక్  స్ప‌ష్టం చేసింది. అయితే తాజాగా సుష్మ‌వ్యాఖ్య‌ల‌కు కుల‌భూష‌న్ విష‌యంలో కాస్త వెన‌క్కుత‌గ్గింది.పాక్ ఒక మెట్టుదిగి  జాదవ్‌ను వెంటనే ఉరితీయబోమని పాకిస్థాన్‌ స్పష్టం చేసింది. అప్పీల్‌ చేసుకోవడానికి రెండు నెలల గడువు ఇస్తామని తెలిపింది. పాక్ ఆర్మీ చీఫ్‌కు, అధ్యక్షుడికి క్షమాభిక్ష వినతిని ఇవ్వొచ్చని కూడా పాక్‌ తెలిపింది.

కుల‌భూష‌న్ జాద‌వ్ మ‌ర‌ణ‌శిక్ష విష‌యంలో  భార‌త్‌,పాక్ ల‌మ‌ధ్య మాట‌ల యుధ్దం కొన‌సాగింది. వ్యాఖ్య‌ల‌ప‌ట్ల  అమెరికా నిపుణులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఉగ్ర‌వాదంపై  పోరాటంలో ప్ర‌పంచ దేశాల‌ల్లో పాక్‌ను ఒంట‌రిని చేయాల‌న ప్ర‌య‌త్నిస్తున్న  భార‌త్‌కు వ్య‌తిరేకంగానే పాక్ ఈనిర్ణ‌యం తీసుకుంద‌నీ తెలుస్తోంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.కుల‌భూష‌న్‌పై పాక్ చ‌బుతున్న కార‌ణాలు బ‌ల‌హీనంగా ఉన్నాయ‌ని  అమెరికాలోని  సౌత్  ఏషియ‌న్ సెంట‌ర్ ఎట్ ది అట్లాంటిక్ కౌన్సిన‌ల్  డైరెక్ట‌ర్  భ‌ర‌త్ గోపాల స్వామి అభిప్రాయ‌ప‌డ్డారు. మ‌రో వైపు రెండు దేశాల మ‌ధ్య సంబంధాలు అంత‌త‌మాత్ర‌మే ఉన్నాయ‌నీ  …ఆప‌రిణామంతో భ‌విష్య‌త్తులో మ‌రింత ప్ర‌మాద‌క‌ర ప‌ర ప‌రిస్తితులు  ఎదుర్కొవాల్సి రావ‌చ్చ‌ని ప్ర‌తీ  స్టాత్మ‌క  వుడ్రో  విల్స‌న్  సెంట‌ర్ డిప్యూటీ డైరెక్ట‌ర్ మైకెల్ కుగెల్‌మ‌న్ పెర్కొన్నారు.

జాద‌వ్‌ను అడ్డంపెట్టుకొని భార‌త్‌ను ఇరుకున పెట్టాల‌నే  భావిస్తున్న‌ట్లు ప‌లువురు అభిప్రాయ‌ప‌డ్డారు.పాక్ తీసుకున్న చ‌ర్య‌పై  ప‌లువురు నిపుణులు  అనుమానాలు,ఆందోళ‌న‌లు వ్య‌క్తం చేశారు. పాక్‌ జాదవ్‌ను ఉరి తీస్తే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని భారత్‌ తీవ్రంగా హెచ్చరించింది. తీవ్ర చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోమంటూ భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ తీవ్రంగా హెచ్చరించారు.కుల‌భూష‌న్ జాద‌వ్ విష‌యంలో భార‌త్ ఎటువంటి చ‌ర్చ‌లు తీసుకుంటుందోన‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో అస‌క్తిగా ఎదురు చూస్తున్నాయి.

Also Read

  1. కేటీఆర్ చేయలేనిది లోకేష్ చేయగలడా…!
  2. తెలంగాణ నాయకులకు ఉన్న ప్రేమ.. మీకు లేదా బాబు
  3. బ‌య‌ట‌కు రావాలంటే బెంబేలెత్తుతున్న ప్ర‌జ‌లు
  4. బాబుకు కేంద్ర ఝుల‌క్‌….పోల‌వ‌రం అంచ‌నాలు పెరిగితే రాష్ట్ర‌మే భ‌రించాల‌న్న కేంద్రం

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -