Monday, May 5, 2025
- Advertisement -

లోకేష్ మంత్రి స్థానంలో ఉండి.. ‘వర్థంతి శుభాకాంక్షలు’ అని ఎవరైనా చెబుతారా?

- Advertisement -
nara lokesh blender mistake his speech

లోకేష్‌బాబు రాజ‌కీయాల‌కు కొత్త‌. రాజ‌కీయాల‌ల్లోకి రావ‌డం  ఒక ఎత్తైతే…. కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్న‌ప్పుడు  ఒల్లు ద‌గ్గ‌ర పెట్టుకొనిఆచితూచి మాట్లాడ‌టంనేర్చుకోవాలి. అలా కాకుండా త‌ప్పుగా మాట్లాడితే అంతే ప‌రువు గంగ‌లో క‌ల‌సిన‌ట్లే.  అందులోనే రాష్ట్ర సీఎం కొడుకు అంటే చెప్పాల్సిన ప‌నిలేదు. అలా  మాట్లాడ‌టంలో మ‌న ఐటీ,పంచాయితీ రాజ్ శాఖ మంత్రి లోకేష్ ఆంవేసిన చేయ్యి. ఒక వైపు లోకేష్‌ను మేధావిగా చూపించేందుకు బాబు చేస్తున్న ప్ర‌య‌త్నాలు బెడిసికొడుతున్నాయి.

1990లోనే త‌న‌కు రాజ‌కీయ స‌ల‌హాలు ఇచ్చాడ‌ని గొప్ప‌గా చెప్పుకొనే బాబుకు మాత్రం త‌ల‌వొంపులు తెస్తున్నారు. లోకేష్ ఏంమాట్లాడినా ఇట్టే దొరికిపోతాడు. ఇప్ప‌టి వ‌ర‌కు లోకేష్‌నుంచి  జాలువారిని అణిముత్యాలు చాలానే ఉన్నాయి. కులపిచ్చి, మతపిచ్చి, బంధుప్రీతి.. ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే, అది తెలుగుదేశం పార్టీనే అని సెలవివ్వడంతో మొదలుపెడితే, సైకిల్ గుర్తుకు ఓటేస్తే ఉరేసుకున్నట్టే అనడంతో కలుపుకుంటే.. ఇటీవల ప్రమాణ స్వీకారోత్సవం సమయంలో నాలుక మందమైపోయి తడబడటం వరకూ.. ఎన్నో ఆయ‌న నోటినుంచి జాలు వారిన ఆణిముత్యాలు.  అయితే ఇప్పుడు తాజాగా ఆయ‌న నోటినుంచి మ‌రో ఆణిముత్యం జాలు వారింది.  అంబేద్కర్ జయంతి విషయంలో కూడా లోకేష్  తడబడినట్టుగా వార్తలు హ‌ల్‌చ‌ల్‌చేస్తున్నాయి.

దేశమంతా అంబేద్కర్ జయంతి  కార్య‌క్ర‌మంలో ఉండ‌గా… నారాలోకేష్ బాబు మాత్రం నిన్న అంబేద్కర్ వర్ధంతి అనిపించిందట! అందరికీ అంబేద్కర్ వర్ధంతి శుభాకాంక్షలు తెలిపాడాయన. అయినా వర్ధంతికి బుద్ధి ఉన్న వాళ్లెవ్వరూ శుభాకాంక్షలు తెలపుతారా. అంబేద్కర్ వంటి మహనీయుడి విషయంలో అలాంటి మాట అన్నందుకు కేసు పెట్టొచ్చు. అయితే లోకేష్ కు వర్ధంతి, జయంతికి తేడా కూడా తెలిసియ‌ని లోకేష్ మ‌న మంత్రినా అని జ‌నాలు నోటిమీద నోలేసుకుంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వర్ధంతికి శుభాకాంక్షలు అంటూ చెప్పిన వ్యక్తి బ‌హూశ లోకేశే కావ‌చ్చు. రాష్ట్రానికి మంత్రి, బాలమేధావి, ఇంకా చెప్పాలంటే.. ఏపీని మూడు నాలుగు దశాబ్దాల పాటు పాలించబోయే ముఖ్యమంత్రి కొడుకు ఇలా మాట్లాడ‌ట‌మేంట‌ని అనుకుంటున్నారు.. ఇంకేముంది… లోకేష్ బాబును ఏకేస్తోంది. లోకేష్ బాబు భాష‌విష‌యంలో వైసీపీ నాయ‌కులు చెబుతున్న మాట‌లు నిజ‌మేనిని పిస్తోంది. ఇక ఇంటి ద‌గ్గ‌ర ట్యూష‌న్ చెప్పించుకుంటే బాగుంటుంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు.

Related

  1. అఖిల ప్రియ చెల్లెలు మౌనిక పోటీచేస్తుందా..! 
  2. జ‌గ‌నే సీఎం…. ఇది పిక్స్‌
  3. రాజకీయాల్లో సంచలనం.. వైసీపీలోకి మాజీ మంత్రి.. సీటు కన్ఫర్మ్ చేసిన జగన్…!
  4. అఖిల ప్రియ చెల్లెలు మౌనిక పోటీచేస్తుందా..! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -