నయీం ఇంతకాలం ఈ కరుడుగట్టిన నేరస్తడి ఆగడాల గురించి పోలీసులకు తెలీదా.. పేరునే బ్రాండ్ గా మార్చి భాగ్యనగరం చుట్టుపక్కలే దందాలు చేస్తున్న నరహంతకుడు నయీంను ఇంతకాలం ఎందుకు వదిలేశారు.
ఇప్పుడే ఎందుకు చంపారు. వాస్తవానికి నయీం ఎక్కడ ఉన్నాడో ఖాకీలకు భాగా తెలుసు. ఏంచేస్తున్నాడో కూడా సమాచారం నిమిషం నిమిషం అందుతుంటుంది. అయినా పట్టుకోవడానికి వారికి లేనిదల్లా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు. పాలకుల నుంచి గ్రీన్ సిగ్నల్. వేల మంది పొట్ట కొట్టి.. తాను బతకడమే కాదు.. ఎంతో మంది పెద్దలగా చెప్పుకునే ఛీడపురుగులకు లైప్ సెటిల్ చేసిన చరిత్ర నయీంది. అందుకే టచ్ చేయకపోవడానికి కారణమని ఎవరిని అడిగినా ఇట్టే చెబుతారు. నయీం పేరు చెప్పుకుని బతికిన కిందిస్థాయి సిబ్బంది ఉన్నారు. బడా అధికారులూ ఉన్నట్టు విమర్శలున్నాయి. లొంగిన నాయకులకు సిరులు కురిపించాడు. లొంగని వారికి బెదిరింపులతో దగ్గరకు రప్పించుకున్నాడు. మరికొందరికి ఎన్నికల ఫండ్ ఇచ్చి తనదారికి తెచ్చుకున్నాడు. ఇలా అందిరినీ తన అదుపులో పెట్టుకుని ఆగడాలకు ఒడిగట్టాడు. కొందరు జర్నలిస్టులు, అధికారులు అన్ని వర్గాలను తనదగ్గర పడుండేలా చేసుకున్నాడు.
ఇప్పుడు కూడా కేసీఆర్ ఆదేశాలతోనే పోలీసులు రంగంలో దిగి నయీం అంతుచూసినట్టు తెలుస్తోంది. లేదంటే ఇంకా ఆగడాలు కొనసాగేవి. ఇటీవల నయీం ఓ ఎమ్మెల్యేను నేరుగా హెచ్చరించాడట. తనకు మద్దతుగా ఉన్న నాయకులను వచ్చే ఎన్నికల్లో నిలబెట్టడానికి అవకాశం ఇవ్వాలని.. ప్రస్తుత ఎమ్మెల్యేను అడ్డుతప్పుకోవాలని ఆదేశించాడట. మాట వినకపోతే మనిషివే ఉండవని హెచ్చరికలు కూడా పంపినట్టు తెలుస్తోంది. అలా ఇద్దరు ముగ్గురు నాయకులకు నయీం బెదిరింపులు కామన్ అయ్యాయట. ఇక డబ్బుల కోసం మరికొందరినీ కూడా సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎమ్మెల్యేలంతా వెళ్లి సిఎం దగ్గర మొరపెట్టుకున్నారట. అంతే కాదు.. ఇప్పడిప్పడే అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ – యాదాద్రి కారిడార్‌కు నయీం ప్రతిబంధకంగా మారారని ఫిర్యాదులు బలంగా వెళ్లాయి. అటుగా రియల్ వ్యాపారులు వెళ్లాలంటేనే భయపడుతున్నారని పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సిఎంకు విషయం వెళ్లింది. వ్యాపారులు ఎవరు వచ్చినా నయీం గ్యాంగ్ పర్సంటేజీలతో వాలుతున్నారట. ఇవన్నీ తెలిసిన సిఎం నయీం కథ తేల్చాలని ఆదేశించినట్టు సమాచారం.
వాస్తవానికి అరెస్టు చేయాలని భావించినా పోలీసులు మాత్రం ఎన్ కౌంటర్‌కే మొగ్గుచూపినట్టు ప్రచారం జరుగుతోంది. అరెస్టు చేస్తే పాత కేసుల్లో భాగంగా గుజరాత్ పోలీసులకు, సిబిఐకి అప్పగించాల్సి వస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థల చేతిలో నయీం పడితే ఇంతకాలం అరాచకాలకు అండగా నిలిచిన పెద్దల బాగోతాలు బయటపడతాయి. పోలీస్ అధికారులే కాదు.. రాజకీయ నాయకులు కూడా చిక్కుల్లో పడతారు. ఇది రాజకీయంగా కొత్త సమస్యలకు తెచ్చిపెడుతుంది. అందుకే ఉన్నతాధికారులు కూడా ఖేల్ శాశ్వతంగా ఖతం చేయడానికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. మొత్తానికి నరహంతకుడు నయీం కథ అలా ముగిసింది. అయితే ఇప్పుడు నయీం అనుచరుల పేరుతో ఎంపీపీలు, చోటచోటా నాయకులు, జర్నలిస్టులను అదుపులోకి తీసుకుంటున్నారు. అసలు సూత్రధారులను లాగుతారా? కేసు కూడా ఖతం చేస్తారా?
Related