Tuesday, May 14, 2024
- Advertisement -

గ్యాంగ్ స్టర్ నయీం జీవితం మీద సినిమా ?

- Advertisement -

గత ఇరవై నాలుగు గంటలగా తెలుగు న్యూస్ చానల్స్ లో హాట్ టాపిక్ గా మారింది నయీ ముద్దీన్ ఎన్ కౌంటర్ వ్యవహారం. తెలుగు రాష్ట్రాలు రెండింటా ఈ విషయం మీద అందరూ చర్చించుకుంటూ ఉన్నారు. సినిమా స్టొరీ కి మించిన బోలెడు ఎలిమెంట్ లు నయీం అనే గ్యాంగ్ స్టర్ జీవితం లో ఉన్నాయి. ఉన్నత పోలీసు అధికారుల దగ్గర నుంచీ అందరికీ ఇతను అంటే ఒకప్పుడు హడల్.

మాజీ నక్షలైటు గా లొంగిపోయిన నయీం గాంగ్ స్టర్ గా మారడానికి ఎంతో టైం పట్టలేదు. కోబ్రా గ్యాంగ్ లని సృష్టించింది కూడా నయీమే. ప్రభుత్వం స్వయంగా ఒక పావుగా నయీం ని చాలా సార్లు వాడుకుంది. ఒక వ్యక్తి లైఫ్ లో ఇన్ని కోణాలు చాలా అరుదుగా దొరుకుతాయి. పైగా మాఫియాకి లింక్ అవడం చాలా మంది దర్శకులను ఆకర్షించే విషయమే.

ఇలాంటి సినిమాలు తీయడంలో దిట్ట సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఇప్పటివరకూ నయీమ్ పై సినిమా తీస్తున్నా అని వర్మ అనౌన్స్ చేయకపోవడమే ఆశ్చర్యకరమైన విషయం. వీలైనంత తొందరలో వినేసినా ఆశ్చర్యం అక్కర్లేదు. అయినా.. మాఫియా టైపు సినిమాలంటే వర్మకు ఏమన్నా పేటెంట్స్ ఉన్నాయా ఏంటి? ఇలా రియల్ లైఫు కేరక్టర్లతో సినిమా చేసే సత్తా వేరే ఎవరికీ లేదా? ఏమో చూద్దాం.. ఆ తెగువ ఉన్న దర్శకుడు ఎవరో!

Related

  1. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు
  2. రామ్ ‘హైపర్’ ఫస్ట్ లుక్ ఎలా ఉంది అంటే?
  3. రామ్ చరణ్ ధృవ రిలీజ్ డేట్!
  4. హీరో రామ్ ఏలాంటి పాత్ర చేయబోతున్నాడో తెలుసా?
  5. నయీం కథ ముగిసిందిలా..!
  6. నయీం ఖతంలో కొత్త కోణం..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -