Sunday, May 4, 2025
- Advertisement -

పార్టీలు వేర‌యినా గ‌మ్యం ఒక్క‌టే…. ఒకే వేదిక మీద క‌ల‌కుస్తారా..?

- Advertisement -
Pawan Kalyan and YS Jagan on one stage in Congress meeting for AP special states..?

ఏపీ రాస‌జ‌కీయాల్లో సంచ‌ల‌నం చోటు చేసుకోబోతుందా…? ఇద్ద‌రు ప్ర‌ముఖ నాయ‌కులు ఒకే వేదికి మీద క‌లుస్తారా …అన్న‌ది ఇప్పుడు చ‌ర్చ‌నీయాశంగా మారింది.పార్టీలు వేర‌యినా ఇద్ద‌రి గమ్యం ఒక్క‌టే.

ఒక‌రు రాజ‌కీయాలల్లో ప్ర‌జాభిమానం ఉన్న‌నేత అయితే మ‌రోక‌రు ఇటీవ‌లే పార్టిపెట్టి సినీ అభిమానం ఉన్న‌నేత‌.ఇప్పుడు వీల్లిద్ద‌రూ ఒకే వేదిక మీద క‌లిసే అవ‌కాశం వ‌చ్చింది.ఒక వేల క‌లుస్తే రాజ‌కీయాల్లో సంచ‌ల‌న‌మే అవుతుంది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈ నెల 4న గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ‘ప్రత్యేక హోదా భరోసా సభ’ ను నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ, శరద్ యాదవ్, సీతారాం ఏచూరి, సురవరం, అఖిలేశ్ వస్తున్నట్లు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి తెలిపారు. వైసీపీ అధినేత, ప్రతిపక్షనేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌ను కూడా సభకు ఆహ్వానించామని చెప్పారు.
ప్రత్యేక హోదా భరోసా సభ పేరుతో ఈ నెల 4వ, తేదిన గుంటూరులో నిర్వహించే సభకు వైసీపీ చీఫ్ జగన్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ లు ఒకే వేదికను పంచుకోనున్నార‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ నేతలు ఒకే వేదికను ఇప్పటివరకు పంచుకోలేదు. అయితే రాష్ట్రంలో రాజకీయపరిస్థితులు మార్పులు చోటుచేసుకొన్నాయి. ప్రత్యేక హోదాను పవన్ కళ్యాణ్ సమర్థిస్తున్నాడు. వైసీపీ కూడ ప్రత్యేకహోదాను సమర్థిస్తోంది.

{loadmodule mod_custom,Side Ad 2}

2014 ఎన్నికలకుముందు టీడీపీ-బాజాపా కూట‌మికి ఓటువేయాల‌ని ప్ర‌చారం చేశారు.కాని ఆత‌ర్వాత ఇరు ప‌ర్టీలు ప్ర‌త్యేక‌హోదాను ప‌క్క‌పెట్ట‌డంతో ప‌వ‌న్ ప‌క్క‌కు త‌ప్పుకున్నారు. అయితే మూడేళ్ళకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుసరించిన విధానాలపై పవన్ కళ్యాణ్ బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.ప్రత్యేక హోదా గురించి పవన్ ప్రత్యేకించి సభలు నిర్వహించారు.
అయితే జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా షూటింగ్‌‌లో బిజీబిజీగా ఉన్నారు. మరి రఘువీరా ఆహ్వానం మేరకు సభకు హాజరవుతారా లేదో వేచి చూడాలి.!

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

{youtube}J4YWntIN0W0{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -