Tuesday, May 14, 2024
- Advertisement -

కాన్ఫిడెన్సా …. ఓవ‌ర్ కాన్ఫిడెన్సా

- Advertisement -
Special story on YS Jagan Confidence or over-confidence

‘థ‌ర్టీ ఇయ‌ర్స్‌ ఇండ‌స్త్రీ’ అనే డైలాగు వినే ఉంటాం…  ఖ‌డ్గం సినిమాలో   పృధ్వీరాజ్ చెప్పిన ఈ డైలాగ్  ఎంత పాపుల‌ర్ అయ్యిందో  అంద‌రికీ తెలిసిందే.  అలాంటి డైలాగే  ఇప్పుడు మ‌న జ‌గ‌న్  నోటివెంట త‌రుచూ వింటుంటాం..   అదేనండి  ఇక ‘నేనే సీఎం’ ….. కాబోయే ముఖ్య‌మంత్రిని అధికారులు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించండిం లేదంటే జైలుకు వెల్లాల్సి ఉంటుంద‌ని హెచ్చ‌రించిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయి.

మొన్నా మ‌ధ్య విశాఖ ఏయిర్‌పోర్టు్‌లో అధికారుల‌తో వ్య‌వ‌హ‌రించిన తీసు అంద‌రూ చూసే ఉంటారు. ఆత‌ర్వాత కృష్ణా జిల్లా క‌లెక్ట‌ర్‌కే జైలుకు పంపిస్తాని వార్నింగ్ ఇచ్చిన మాట‌లు  వినే ఉంటారు. ‘థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌ష్ట్ర’ లాగా ఎక్క‌డికి వెల్లినా ‘నేనే సీఎం’ అనే మాట ఇప్పుడ ఏపీలో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.   ఇవ‌న్నీ మ‌రువ‌కు ముందే  ఇప్పుడ తాజాగా అదేమాట మ‌రోసారి  జ‌గ‌న్‌నోటి వెంట వ‌చ్చింది. ప్లేస్ ఏదైనా స‌రే… సెంట‌ర్ ఏదైనా స‌రే …నేనే సీఎ అన్న మాట .  త‌న సొంత నియేజ‌క‌వ‌ర్గం పులివెందుల మండ‌లం లోని లింగాల  ఎంపీడీవో కార్యాల‌యం వ‌ద్ద నిర్వ‌హించిన ప్ర‌జాద‌ర్బారులో ఈసంఘ‌ట‌న చోటు చేసుకుంది. మండ‌ల స్థాయి అధికార‌లు, ప్ర‌జాప్ర‌తినిధులు,ప్ర‌జ‌ల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు.  నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స‌త్వ‌ర‌మే ప‌రిస్క‌రించండంటు అధికారుల‌ను హెచ్చ‌రించారు.

ప్ర‌జా ద‌ర్భారు కార్య‌క్ర‌మంలో   ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై అధికారులు స్పందించ‌డ‌లేద‌నీ …. ఏయీ పై ప్ర‌జ‌లు, ప్ర‌జా ప్ర‌తినిధులు , జ‌గ‌న్‌కు పిర్యాదు చేశారు. డ‌బ్బులివ్వ‌నిదే ఏప‌నీ అధికారులు చేయ‌డంలేద‌నీ….. ఏయీ డబ్బు కోసం పీడిస్తున్నాడని, ఎవరు డబ్బులిస్తే వారి తాగునీటి బిల్లులు త్వరగా వచ్చేలా చూస్తున్నారన్నారు. డబ్బు ఇవ్వని వారిని ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై జగన్ తీవ్రంగా స్పందించారు. 2019 ఎన్నికల్లో ’నేనే సీఎ’ అప్పుడు మీ అంద‌రిమీద విచార‌ణ జ‌రిపిస్తానీ హెచ్చ‌రించారు.

ఒక ప్ర‌జా ప్ర‌తినిధిగా ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై స్పందించే హ‌క్కు జ‌గ‌న్ కు ఉంది.  ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అధికార‌లు ఎలా స్పందిస్తున్నారో  తెలుసుకోవాల్సిన బాధ్య‌త ఉంది. అధికారులు  ప‌నులు చేయ‌పో్తే  ప‌ధ్దితి మార్చుకోండ‌ని చెప్పె డంలో ఎలాంటి అభ్యంత‌రం ఉడ‌దు. కానీ  ప్ర‌తి చిన్న …విష‌యానికి ’నేనే సీఎ’ అని చెప్పెమాట ఇప్పుడు వైర‌ల్‌గా మారుతోంది.. ఎన్నిక‌ల్లో ఏపార్టీ ఒంట‌రిగా పోటీచేస్తుందో.. ఏపార్టీతో క‌లుస్తాయే ఇప్పుడే చెప్ప‌లేని ప‌రిస్తితి. ఎన్నిక‌ల‌కు రెండు సంవ‌త్సరాల టైముంది కాబ‌ట్టి  దీనిగురించి  పార్టీలు ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించ‌లేదు. ఎన్నిక‌లు జ‌ర‌గాలి..ఫ‌లితాలు రావాలి.. ప్ర‌జ‌లు ఎలాంటి తీర్పు ఇస్తారో  ఎవ్వ‌రికి కూడా తెలియ‌దు. మరి ఇప్పుడే ’నేనే సీఎ’ అని చెప్పుకోవడం  చూస్తే  పాత సామెత‌లాగా  ’ఆలూ లేదు  సూలూ లేదు కొడుకుపేరు సోమ‌లింగ’ అన్న‌ట్లు ఉంది జ‌గ‌న్ వ్యవహారశైలి. గ‌త ఎన్నిక‌ల్లో ఆ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎంత‌ప‌నిచేసిందో  జ‌గ‌న్‌కు తెలుసు. మ‌ళ్లీ ఇప్పుడు ఈ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ ఎందుకో అర్థం కావ‌డంలేదు. ఏదైనా స‌మయం వ‌చ్చిన‌పుడు చేత‌ల్లో చూపించాలిగాని ఇలా ఎక్క‌డికి పోయినా అలా మాట్లాడ‌టం చూసి టీడీపీ న‌యకుల‌తోపాటు సాధార‌న జ‌నం కూడా మాట్లాడుకుంటున్నారు.

Also Read

  1. రాజకీయాల్లో సంచలనం.. వైసీపీలోకి మాజీ మంత్రి.. సీటు కన్ఫర్మ్ చేసిన జగన్…!
  2. సాక్షి చదవొద్దు అని చెబుతాడు కానీ బాబు మాత్రం చదువుతాడు 
  3. వైకాపా నుంచి కొమ్మినేనికి ఊహించని బంపర్ ఆఫర్
  4. జగన్ కు, చంద్రబాబుకు తేడా అదేనట 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -