Tuesday, May 6, 2025
- Advertisement -

ప‌వ‌ణ్‌పై బీజేపీ ఎదురు దాడి

- Advertisement -
pawan kalyan vs bjp

జ‌న‌సేన అధినేత ప‌వ‌ణ్ క‌ళ్యాన్‌పై బీజేపీ స్వ‌రం కాస్త పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు  తూతూ మంత్రింగా  విమ‌ర్శ‌లు చేసిన  బీజేపీలో మార్పు క‌నిపిస్తోంది. తాజ‌గా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నం క‌లిగిస్తున్నాయి.  ప‌వ‌ణ్‌కు ఏపీలో టీడీపీకి మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో మళ్లీ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్తాయికి చేరుతున్న సంగ‌తి తెలిసిందే.ఇక టీడీపీకీ తోడ  తాజాగా ప్రత్యేకహోదా కోసం పవన్ కల్యాణ్ ఉద్యమం చేస్తాననడం హాస్యాస్పదమన్నారు.

ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమ‌ని దీనిపై  ప్రత్యేక హోదా మీద ఎవరైనా ఉద్యమం చేస్తామంటే… మళ్లీ సమైక్యాంధ్రపై ఉద్యమం చేసినట్టు ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు.ఇవ‌న్నీ చూసుకుంటే ప‌వ‌ణ్‌మీద ఎదుర‌దాడి మొద‌లు పెట్టారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆయన తమ్ముడు పవన్ కళ్యాన్ కే  ఎంత క్రేజ్ ఉందో చెప్ప‌వ‌చ్చు.  రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించినప్పటికీ ఎలాంటి పోటీ చేయ‌లేదు. ఏపీకీ ప్ర‌త్యేక‌హోదా ఇస్తామ‌ని బీజేపీ చెప్ప‌డంతో యకుండా బిజెపి, టీడిపీ పార్టీలకు సపోర్ట్ చేసి పరోక్షంగా వాటి గెలుపు కోసం ప్రయత్నించారు. అనుకున్న‌ట్లుగానే బీజేపీ-టీడీపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. అంతే కాదు గత కొంత కాలంగా ఏపీకి ప్రత్యేక హోదా కోసం అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు పవన్ కళ్యాన్.  అప్పటి నుంచి ఆ పార్టీ నెతలు పవన్ ని టార్గెట్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రత్యేక హోదాపై చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు సభలో లేకపోవడం చాలా బాధాకరమని ప‌వ‌ణ్ ట్విట్ట‌ర్‌లో  విమ‌ర్శించారు.

ప్రత్యేక హోదాకోసం లోక్సభ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం అభినందనీయమని ఆయన నిన్న అన్నారు.  హోదా సాధించాలన్న ఆకాంక్షతో వైకాపా ఎంపీలు బాగా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ఇవ్వాల్సిందేనంటూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేసిన వార్తకు సంబంధించిన క్లిప్పింగ్ను పోస్టుచేశారు. ప్ర‌త్యేక హోదా కోసం తెలంగాణ ఎంపీలు స‌పోర్ట్ చేస్తున్నార‌ని అభినందించారు. ప‌వ‌ణ్ ట్విట్ట‌ర్‌లో స్పందించటంతో బీజేపీకూడా ఎదురుదాడి చేస్తోంది. ఇప్పటికే పవన్ మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేశారు..కానీ ఏం సాధించారో ఆయనకు కూడా అర్థం కాకపోవచ్చుని విమ‌ర్శించారు.  ప్రత్యేకహోదా పేరు చెప్పి, ప్రజల సమయం వృథా చేయవద్దని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతోందని, హోదా కంటే ఎక్కువ సౌకర్యాలు కల్పించే ప్రయత్నంలో ఉందని ఆయన తెలిపారు. ఇవ‌న్నీ చూస్తుంటే ప‌వ‌ణ్‌తో బీజేపీ ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిన‌ట్లే క‌నిపిస్తోంది. బీజేపీ కూడా పవన్ పై ఎదురుదాడి పెంచడానికి సిద్ధమవుతోందని రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది.

Related

  1. ప్ర‌త్యేక హోదాపై టీడీపీ ఎంపీల తీరుపై ట్విట్ట‌ర్‌లో ప‌వ‌ణ్ స్పంద‌న‌
  2. పార్టీలో టికెట్ల  బేర‌సార‌ల లొల్లి ఏంది ప‌వ‌ణ్‌
  3. ప‌వ‌న్‌ ల‌వ‌ర్‌.. ఇప్పుడు చరణ్ కి అత్త‌!
  4. బిత్తిరి స‌త్తికి చుక్క‌లు చూపించిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -