Friday, May 17, 2024
- Advertisement -

బిత్తిరి స‌త్తికి చుక్క‌లు చూపించిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌!

- Advertisement -
pawan showing stars to bithiri sathi

తెలుగు వారికి తీన్మార్ వార్త‌ల‌తో బిత్తిరి స‌త్తి బాగా ద‌గ్గ‌ర‌య్యాడు. త‌న అక్క సావిత్రితో కలిసి తీన్మార్ వార్త‌ల్లో రకరకల వేషాలు వేస్తూ బిత్తిరి స‌త్తి చేసే కామెడీకి తెలుగు ప్రేక్ష‌కులు తెగ నవ్వాల్సిందే. బిత్తిరి స‌త్తి తెలంగాణ యాస‌లో చేసే విన్యాసాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఫిదా అయిపోయారు.

అంతేకాకుండా స్వ‌యంగా కేసీఆర్ స‌త్తిని పిలిపించుకుని అభినందించారు. అలాంటి సత్తి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి బాగా టార్గెట్ అయ్యాడు. విశాఖ‌లో ప్ర‌త్యేక హోదా కోసం జ‌రిగిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌కు ప‌వ‌న్ మ‌ద్ద‌తుగా ట్వీట్ట‌ర్‌లో కొన్ని కామెంట్స్ చేశారు. ఈ ట్వీట్ట‌ర్ మెసేజ్‌ను బిత్తిరి స‌త్తి త‌నదైన స్టైల్లో వ‌క్రీక‌రించి కామెడీ చేసి చూప‌డంతో అది ప‌వ‌న్ ఫ్యాన్స్ కోపం తెప్పిచ్చింది.  ప్ర‌త్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు క‌లిసి జ‌ల్లిక‌ట్టును ఆద‌ర్శంగా తీసుకుని పోరడాలని చెప్పారు.

అయితే ఆ మెసేజ్‌ను బిత్తిరి స‌త్తి, సావిత్రి అక్క క‌లిసి హాస్యంగా చేసి చూపించార‌ని ప‌వ‌న్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై సోష‌ల్ మీడియా లో ప‌వ‌న్ అభిమానులు ప‌వ‌ర్‌స్టార్ గురించి ఏ మాత్రం త‌ప్పుగా మాట్లాడినా ఇద్ద‌రికి మామూలుగా ఉండదని చెప్పి మరీ వార్నింగ్ లు ఇస్తున్నారు. బిత్తిరి సత్తి – సావిత్రి ఈ విషయం వదిలేయకుండా ఫాన్స్ పెట్టిన కామెంట్స్‌పై మ‌రో ఎపిసోడ్ చేసి ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌ప్ప‌క చూడాలని మ‌రో వీడియో యూ ట్యూబ్‌లో పెట్టారు. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి.

{youtube}ccsOi9vMnZE{/youtube}

Related

  1. ప‌వ‌న్‌ ల‌వ‌ర్‌.. ఇప్పుడు చరణ్ కి అత్త‌!
  2. అప్పుడే లీక్ అయిన కాట‌మ‌రాయుడు.. ప‌వ‌న్ సీరియ‌స్‌!
  3. 2016లో ప‌వ‌న్, మ‌హేష్‌ లకు ఘోర అవ‌మానం
  4. ప‌వ‌న్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సునీల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -