Sunday, May 19, 2024
- Advertisement -

ఏపీ రాజకీయాలో మరో సంచలనం.. వైసీపీలోకి కాంగ్రెస్ సీనియర్ మహిళా నేత

- Advertisement -
senior women congress leader join ysrcp

ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు మొదలు అయ్యాయి. ముఖ్యంగా ప్రతిపక్ష వైసీపీ పార్టీలోకి వలసల జోరు ఎక్కువగా ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చే చాన్స్ ఉండని పలు సర్వేలు తెలుపుతున్న సమయంలో మాజీ ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నుంచి జగన్ పంచన చేరుతున్నారు.

విభజన నెపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏపీలో సమాధి కావడంతో ఆ పార్టీ నాయకులు.. క్రియాశీలక రాజకీయాల్లో కనుమరుగై పోయారు. కొంత మంది అధికార పార్టీ అయిన టీడీపీలో చేరగా.. మరి కొంత మంది వైసీపీ లో చేరారు. కాగా ఇప్పటికి కాంగ్రెస్ లో ఉంటున్న ముఖ్యమైన నేతల్లో స్వయంగా పీసీసీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ప్రస్తుతం బిజేపీలో ఉన్న మాజీ కాంగ్రెస్ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. కాగా కాంగ్రెస్ మహిళా నేతలు కూడా వైసీపీలోకి చేరడానికి మొగ్గు చూపుతున్నారు. సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీ దేవి తన అనుచర వర్గంతో జగన్ సమక్షంలో వైసీపీ చెరిన విషయం తెలిసిందే.

రీసెంట్ గా మరో సీనియర్ కాంగ్రెస్ మహిళానేత.. ఏపీ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ తర్వలో వైసీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా ఆమె తన హవా నడిపించారు. ప్రజల సమస్యలపై, మహిళలపై తెలుగు తమ్ముళ్లు ఆఘాయిత్యాలపై టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు నిరసన కార్యక్రమాలను పద్మశ్రీ విజయవంతంగా నిర్వహించింది. అయితే కనుచూపు మేరలో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ కోలుకునే పరిస్థితి కనిపించకపోవడంతో తన రాజకీయ భవిష్యత్తు కోసం సుంకర పద్మశ్రీ వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె వైసీపీ శ్రేణులతో మాట్లాడినట్లు సమాచారం. వైసీపీలో రోజా తర్వాత అంతటి బలమైన మహిళా నాయకురాలు లేరు. వైసీపీ మహిళా వింగ్ కూడా బలహీనంగా ఉంది. ఈ క్రమంలో కాంగ్రెస్ లో ప్రతిభావంతమైన నాయకురాలిగా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ వైసీపీలో చేరితే మాత్రం నిజంగా ఏపీ రాజకీయాల్లో ఆ పార్టీకి మరింత బలం చేరినట్లే. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. కృష్ణ జిల్లాలో సంచలనం.. వైసీపీలోకి ముగ్గురు కీలక నాయకులు
  2. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం జ‌గ‌న్ వేసిన ప్లాన్ అదిరింది
  3. చంద్రబాబుకు షాక్ఇచ్చిన కడప జిల్లా వైసీపీ ఎమ్మెల్యే.. 2019లో విజయం ఖాయం..
  4. భూమా చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -