చిత్తూరు జిల్లా టీడీపీలో కలకలం మొదలైంది. ఆపార్టీ సీనియర్‌నేత ఎంపీ శివప్రసాద్ వైసీపీలోకి వెల్లేందు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈవార్త చిత్తూరు జిల్లాలో హల్ చల్ చేస్తోంది.దీంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.అదే జరిగితే టీడీపీకీ కోలుకోలేని దెబ్బతగిలినట్లే.తాజాగా శివప్రసాద్ బాబుపై చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. గత కొంత కాలంగా చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలపై నిగురుగప్పిన నిప్పులా ఉన్న శివప్రసాద్ ఇప్పుడు చేసిన విహర్శలు దేనికనే సంకేతాలు టీడీపీ తమ్ములనుంచి వినిపిస్తున్నాయి.
చిత్నూరు జిల్లాలో పార్టీ సీనియర్ నేతగా చెలామని అవుతున్న శివప్రసాద్ చంద్రబాబును మొదటి సారి తీవ్రస్తాయిలో విమర్శించడం గమనర్హం.దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక తికమక పడుతున్నారు.శివప్రసాద్ పార్టీకి దూరమవుతున్నారా….తన అసంతృప్తిని మాత్రమే బయట పెడుతున్నాడనీ తర్జనా భర్జనా పడుతున్నారు. చంద్రబాబు దళితులను మోసం చేశారంటూ ఎంపీ శివప్రసాద్ విరుచుకుపడ్డారు. ఏడాది పొడవునా 125వ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు. అంబేద్కర్ జయంతికి జిల్లా కలెక్టర్ డుమ్మా కొట్టాడంటూ శివప్రసాద్ తీవ్రంగా స్పందించారు. దళితులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. అంతే కాకుండా ల్యాండ్‌పూలింగ్ పేరుతో దళితుల భూములను లాక్కొని వారిని కూలీలుగా మార్చారంటూ మండిపడ్డారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులిస్తే రెండూ ఓసీలకే కేటాయించారన్నారు.రాష్ట్రంలో ఎస్సీలకు పదవులిస్తే రెండు కూడా గుంటూరు ప్రాంతం వారికే ఇచ్చేశారని అన్నారు.
డిప్యూటీ సీఎం పదవులు కూడా కాపులు, బీసీలకు ఇచ్చారని.. ఎస్సీలకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. శివప్రసాద్ చేసిన వ్యాఖ్యల వెనుక గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలే కారనంగా తెలుస్తోంది. ఇటీవల తన సొంత కూతురు విషయంలో మాజీ మంత్రి బొజ్జల వర్గీయులు అనుచితంగా ప్రవర్తిస్తే.. వైయస్సార్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండగా నిలబడ్డాడే గానీ, టీడీపీ వర్గంవారు కనీస మద్దతు కూడా తెలుపలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు గానీ, ప్రస్తుత మంత్రి లోకేష్ గానీ ఈ విషయంపై స్పందింకపోవడం బాదేశిందన్నారు. ఇప్పటికే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో శివప్రసాద్ పార్టీ మారడంపై చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పార్టీ మారినా చిత్తూరు నుంచే శివప్రసాద్‌కు అవకాశం కల్పించే విధంగా చర్చలు కొనసాగించినట్లు సమాచారం. గతంలో చిత్తూరు నుంచి టీడీపీ తరపున శివప్రసాద్ బరిలో ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాన్య కిరణ్ పోటీ చేసి ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఇదే జరిగితే టీడీపీకీ పెద్ద ఎదురుదెబ్బతగలనుంది.
Related