Tuesday, May 14, 2024
- Advertisement -

నా కులం తో నాకు సంబంధం లేదు – హీరో శివాజీ

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ కి ప్రత్యేక హోదా విషయం లో కాస్త గట్టిగా పోరాడుతున్న వారిలో హీరో శివాజీ ప్రముఖ వ్యక్తి. శివాజీ ప్రత్యేక హోదా విషయం లో అంతా బీజేపీ మీదా, కేంద్ర ప్రభుత్వం మీదా తోసేసి చంద్రబాబు ని ఏమీ అనకుండా చేతులు దులుపుకుంటున్నారు అనే అపవాదు కూడా నడుస్తున్న తరుణం లో ఆయన మీడియా తో ఇవాళ మాట్లాడారు.

విజయవాడ లో పుష్కరాల సందర్భంగా వచ్చిన శివాజీ ఆర్ధిక ప్యాకేజీ ఇచ్చి కేంద్రం ఊరుకుంటే కుదరదు అంటున్నారు. శివాజీ తొలుత బీజేపీలో ఉండేవారు. అయితే బీజేపీలోనే ఉంటూ ఆ పార్టీని ఇబ్బందిపెట్టేలా మాట్లాడేవారు. దీంతో శివాజీ చంద్రబాబుకు కోవర్టుగా పనిచేస్తున్నారన్న అనుమానాన్ని అప్పట్లో కమలనాథులు వ్యక్తం చేశారు.

అసలు బీజేపీతో శివాజీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించారు. మొన్నటికి మొన్న కొందరు నాయకులు తన కులం గురించి మాట్లాడారు అని తనకి కుల పిచ్చి లేదు అని రాష్ట్రం కోసం, రాష్ట్రానికి రావాల్సిన స్పెషల్ స్టేటస్ కోసం ఎప్పటికీ పోరాడతాను అని శివాజీ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -