Friday, May 17, 2024
- Advertisement -

చంద్రబాబుకు షాక్.. వైసీపీలోకి తెలుగు తమ్ముళ్ళు

- Advertisement -
TDP Leaders Join YSRCP

ఏపీ లో అధికార పార్టీ అయినట్టువంటి తెలుగు దేశానికి చెందిన నేతలు దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకుంటున్నట్లు ఉంది ప్రస్తుతం వారు వ్యవహరిస్తోన్న తీరు. గత ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అమలు కానీ హామీలను చూపించి.. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి.. అధికారంలోకి వచ్చారు.

అధికారంలో వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హమీను కూడా నెరవేర్చలేదు. అంతే కాకుండా చట్ట పరంగా రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా రాకుండా చేస్తున్నాడు. దాంతో విసుగు చెందిన తమ్ముళ్ళు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం అని తెలుసుకుంటున్నారు. ఈ నెపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో ప్ర‌జావ్య‌తిరేక ప‌రిపాల‌న కొన‌సాగిస్తున్న సీఎం చంద్ర‌బాబు ప్రాతినిధ్యం వహిస్తోన్న తెలుగుదేశం పార్టీని వీడి అనేక మంది నాయ‌కులు వైసీపీ పార్టీని ఆశ్ర‌యిస్తున్నార‌ని తూర్పుగోదావ‌రి జిల్లా ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గం పార్టీ కో-ఆర్డినేట‌ర్ పితాని బాల‌కృష్ణ తెలిపారు.

ముమ్మిడివరం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కాట్రేనికోన మండ‌లంలోని ప‌లువురు టీడీపీ నేత‌లు,మండల టీడీపీ మాజీ అధ్యక్షుడు ,సుమారు రెండు వందలకు పైగా టీడీపీ కార్యకర్తలు బాలకృష్ణ ఆధ్వ‌ర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.  ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ వారికి కండువాలు వేసి సాద‌రంగా వైసీపీ పార్టీలోకి ఆహ్వానించారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -