Sunday, May 5, 2024
- Advertisement -

జియో దెబ్బ‌కు దిగివ‌స్తున్న టెలికంరేట్లు

- Advertisement -
Vodafone special offer Rs 19 get 100MB 4G data unlimited calls

రిల‌య‌న్స్ జియే మార్కెట్‌లోకి ఎంట‌ర‌యిన త‌ర్వాత టెలికంరంగంలో భార్పులు చోటు చేసుకున్నాయి.అప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధికంగా ఉన్న డేటా రేట్లు జియే ఎంట‌ర్‌తో ఒక్క సారిగా దిగివ‌చ్చాయి.

త‌మ క‌ష్ట‌మ‌ర్ల‌ను కాపాడుకొనేందుకు టెలికం సంస్త‌లు నానాపాట్లు ప‌డుతున్నాయి.దీనిలో భాగంగా టెల‌కంకంపెనీల మ‌ధ్య పోటీ పెరిగి భారీ అఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి.
తాజాగా వొడాఫోన్‌ కూడా ఈ జాబితాలో చేరింది. రూ.19 ప్రారంభ ధరతో ఉచిత కాల్స్‌, 4జీ డేటాను అందిస్తూ సరికొత్త ఆఫర్‌ను తీసుకొచ్చింది. వొడాఫోన్‌ సూపర్‌ డే, సూపర్‌ వీక్‌ పేరుతో ఈ సదుపాయాన్ని యూజర్లకు అందిస్తోంది. అయితే ఈ అవకాశం కేవలం ప్రీ పెయిడ్‌ యూజర్లకు మాత్రమే అందిస్తున్నట్లు వొడాఫోన్‌ తెలిపింది.

{loadmodule mod_custom,GA1}

వొడాఫోన్‌ సూపర్‌ డే ఆఫర్‌ ప్రకారం.. రూ. 19తో రీఛార్జ్‌ చేస్తే అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌ ఉచితంగా చేసుకోవచ్చు. దీంతో పాటు 100ఎంబీ 4జీ డేటాను కూడా అందిస్తోంది. ఇక సూపర్‌ వీక్‌ ఆఫర్‌ కింద రూ. 49తో రీఛార్జ్‌ చేసుకుంటే.. అపరిమిత లోకల్‌, ఎస్‌టీడీ కాల్స్‌తో పాటు 250ఎంబీ 4జీ డేటాను ఇస్తున్నట్లు వొడాఫోన్‌ తెలిపింది.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -