Sunday, May 19, 2024
- Advertisement -

ఒడిశాలోని చాందీపూర్‌ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి ప‌రీక్షించిని సైన్యం

- Advertisement -
India successfully Prithvi-II missile test-fired

స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణి పరీక్ష వ‌రో సారి విజయవంతమైంది. అణు సామర్థ్యంతో రూపొందించిన ఈ క్షిపణిని సైన్యం నేడు ఒడిశాలోని చాందీపూర్‌ సమీపంలో గల ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి పరీక్షించింది. ఉదయం 9.50 గంటలకు క్షిపణిని ట్రయల్‌ చేయగా.. అది విజయవంతమైందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 350 కి.మీ.దూరంలోని లక్ష్యాలను సమర్థంగా చేధించగలదు. 500 కేజీల నుంచి 1000కేజీల వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. గతేడాది నవంబర్‌లోనూ ఇదే బేస్‌ నుంచి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు.

{loadmodule mod_custom,Side Ad 1}

రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారత్ డైనమిక్స్ సంస్థల సంయుక్త పరిశోధనే పృధ్వి -2 బాలిస్టిక్ మిసైల్. దీన్ని తొలిసారిగా 1996 జనవరి 27న ప్రయోగించారు. ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మధ్య మధ్యలో ఇటువంటి పరీక్షలు జరుపుతుండడం పరిపాటి. 4,600 కిలోగ్రాముల బరువుండే ఈ క్షిపణి వెయ్యి కిలోల వరకు వార్ హెడ్ ను మోసుకుపోగలదు. 8.56 మీటర్ల పొడవు ఉంటుంది.
అడ్వాన్స్‌ ఇన్‌ఎరిటల్‌ గైడెన్స్‌ సిస్టమ్‌ సాయంతో ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించగలదు. స్ట్రాటెజిక్‌ ఫోర్స్‌ కమాండ్‌ బృందం పృథ్వీ-2ను పరీక్షించగా.. రక్షణ, పరిశోధన, అభివృద్ధి సంస్థ శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు.

Also read

  1. ప్ర‌పంచంలోనే అత్యంత అరుదైన దొంగ‌త‌నం ..ఆ దొంగ దోచుకున్న‌వి ఏంటో తెలుసా…?
  2. ఉత్త‌ర కొరియాతో చ‌ర్చ‌ల‌కు స‌మ‌యం త‌క్కువ‌గా ఉంది
  3. చైనా స‌రిహ‌ద్దుల్లో మూడు రోజుల త‌ర్వాత సుఖోయ్ -30 యుద్ద విమానం గుర్తింపు
  4. స‌రిహ‌ద్దుల్లో పాక్ శిభిరాల‌ను పూర్తిగా ధ్వంసం చేసిన సైనిక ద‌ళాలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -