ఆయ‌న‌తో లంచ్‌ రూ. 16 కోట్లు….

Warren Buffett lunch sold to highest bidder for over $2.6M

ప్ర‌పంచ‌లో ఉన్న గొప్ప‌వాల్ల‌తో ఎవ‌రైనా డిన్న‌ర్ చేయాలంటె అంతో ఇంతో డ‌బ్బు చెల్లిస్తాం.కాని అయ‌న‌తో లంచ్ చ చేయాలంటె అత్యంత ఖ‌రీదు. ప్ర‌పంచంలోనే అత్యంత సంప‌న్నుల జాబితాలో నాలుగో ప్లేస్ సాధించారు. ఆయ‌న కు స్మార్ట్ ఇన్వెస్ట‌ర్ అని కూడా పేరు.

అయితే.. ఆయ‌న‌తో క‌లిసి లంచ్ చేయాల‌నుకుంటే మాత్రం మ‌న క‌రెన్సీలో దాదాపు 16 కోట్ల దాకా క‌ట్టాల‌ట‌.
ఇన్వెస్ట‌ర్ల‌లో ప్ర‌పంచంలోనే స్మార్ట్ ఇన్వెస్ట‌ర్ వారెన్ బ‌ఫెట్‌.అంత డ‌బ్బు క‌ట్టి వారెన్ బ‌ఫెట్ తో లంచ్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడు ఓ వ్య‌క్తి. ఆయ‌న వివ‌రాలు మాత్రం వెల్ల‌డించ‌లేదు. బిడ్ ధ‌ర 2,679,001 డాల‌ర్లు ప‌లికింద‌ట‌. అంటే మ‌న క‌రెన్సీ లో 16 కోట్ల‌కు పైమాటే. ఈ డ‌బ్బును గ్లిడె ఫౌండేష‌న్ అనే చారిటీ సంస్థ‌కు విరాళంగా ఇవ్వ‌నున్నార‌ట‌ వారెన్ బ‌ఫెట్.

{loadmodule mod_custom,GA1}

2004 లో త‌న మొద‌టి భార్య చ‌నిపోయిన త‌ర్వాత ఈ ఫౌండేష‌న్ తో క‌లిసి పని చేస్తున్నారు బ‌ఫెట్. గ‌త సంవ‌త్స‌రం బ‌ఫెట్ లంచ్ కోసం బిడ్ వేయ‌గా ధ‌ర 3,456,789 డాల‌ర్లు ప‌లికింద‌ట‌. అంటే..22 కోట్ల రూపాయ‌ల‌కు పైమాటే. వామ్మో.. ఎన్ని జ‌న్మలెత్తినా మ‌నం వారెన్ బ‌ఫెట్ తో క‌లిసి లంచ్ చేయ‌లేం కాబోలు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}ptae9nw_CF8{/youtube}