Wednesday, May 15, 2024
- Advertisement -

రాజ‌కీయాల్లోకి మాజీ ఎంపీ రీ ఎంట్రీ….

- Advertisement -
Lagadapati Rajagopal reentry Politics 2019 elections moving tdp

స‌ర్వేల రారాజు మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి ర‌జాగోపాల్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం ఇప్పుడు విజయ‌వాడ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నంగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం.పొలిటిక‌ల్ రీఎంట్రీ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్నారు.

ఇందుకోసం తన అనుచ‌రుల‌తో మ‌ళ్లీ మంత‌నాలు జ‌రుపుతున్నారు. ఆయ‌న‌ఎంట్రీతో టీడీపీలో ఆధిప‌త్య‌పోరు కొన‌సాగ‌నుంది.

{loadmodule mod_custom,GA1}

గ‌తంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవడం, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రభుత్వం పనితీరుపై సర్వే చేసి ఆయనకు వివరాలు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.ఈ సంద‌ర్భంగా ల‌గ‌డ‌పాటి టీడీపీలో చేరుతార‌నే ప్ర‌చారం న‌డిచింది. అయితే వ్యాపార ప‌నుల కోసం చంద్ర‌బాబుని క‌లిశార‌ని ఆ త‌ర్వాత తెలిసింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ ల‌గ‌డ‌పాటి రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తార‌నే ప్ర‌చారం బెజ‌వాడ‌లో ఊపందుకుంది.
గడపాటి వస్తే ఏ పార్టీలో చేరుతారు, ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే చర్చ కూడా సాగుతోంది. ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఆయన వైసిపిలోకి, బిజెపిలోకి వెళ్లే అవకాశం లేదు. ఇటీవల చంద్రబాబుకు అనుకూలంగా కనిపిస్తున్నారని, కాబట్టి సైకిల్ ఎక్కే అవకాశాలున్నాయని అంటున్నారు.

{loadmodule mod_custom,GA2}

అయితే ఏనియేజ‌క వ‌ర్గంనుంచి పోటీ చేస్తార‌నేది ఇప్పుడు ఆస‌క్తిగా మారింది.ఆయ‌న పోటీ చేస్తే గుంటూరు లేక విజ‌య‌వాడ‌నుంచి పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇప్ప‌టికే గుంటూరు నుంచి గ‌ల్లా జ‌య‌దేవ్‌,విజ‌య‌వాడ‌నుంచి కేశ‌నేని ప‌ర్ల‌మెంట్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.మ‌రి ఇద్ద‌రిలో బాబు చేతిలో బ‌లి అయ్యేది ఎవ‌రో….?

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}lUR0W5r9QTQ{/youtube}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -