ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫోటోలు చూసి కీర్తి సురేష్ అభిమానులు షాక్ అవుతున్నారు. అదేంటి హీరోయిన్ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకుందా? కీర్తి ని పెళ్లి చేసుకుంది ఎవరు అన్న సందేహాలు వారికి రాకమానవు. అయితే కీర్తి పెళ్లి చేసుకున్న కమెడియన్ ఎవరో కాదు సతీష్. ప్రస్తుతం కమెడియన్ సతీష్ కోలీవుడ్‌లో మంచి ఫామ్‌లో ఉన్నాడు.
ఇక నేను శైలజ సినిమాతో తెలుగు లో అడుగుపెట్టి తాజాగా నాని, బన్ని సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో ఉంది కీర్తి సురేష్. అలాంటిది ఈ సడెన్ మ్యారేజ్ ఏంటని షాక్ అవుతున్నారు సినీ జనాలు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేయడంతో కీర్తి సురేష్‌కు ఈ మ్యాటర్ చేరింది. దాంతో ఆమె అగ్గిమీద గుగ్గిలమయ్యాక కానీ అసలు విషయం తెలియలేదు.
ఇటివలే విజయ్ చిత్రం కోసం తీసిన ఫొటోలను కొందరు ఎడిట్ చేసి ఇలా పక్క పక్కన పెట్టి ఈ ఇద్దరికి పెళ్లయ్యిందని ప్రచారం చేశారు. ఆమె మెడలో దండలను అందరికీ వేశారు. కానీ, ఫోటో ఎడిటింగ్‌లో వారు మిగతావారిని డిలీట్ చేసి.. కేవలం ఈ ఇద్దరిని మాత్రమే ఉంచారు. దీంతో, నిజంగానే కీర్తి సురేష్‌కి సతీష్‌కి పెళ్లి అయిందని పుకార్లు పుట్టించారు. తనకు సతీష్‌తో మ్యారేజ్ కాలేదని కీర్తి చెప్పడంతో ఈ పుకార్లకు తెరపడింది. అయితే అప్పటికే కీర్తి-సతీష్ పెళ్లి మ్యాటర్ సోషల్ మీడియాలో ఈ ఫోటోలతో షేక్ అయింది.
{youtube}wJCzEAtxc7s{/youtube}
Related