Thursday, May 16, 2024
- Advertisement -

శివ బాలాజీ కోసం పవన్ ఏం చేసాడో తెలుసా?

- Advertisement -

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ సెట్స్ లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ఈ సినిమాలో శివ బాలాజీ కూడా నటిస్తున్నారు. శివ బాలాజీ పుట్టినరోజు సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఆయన తన ఎఫ్‌బి అకౌంట్ ద్వారా తెలిపారు. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత…. పుట్టినరోజు వేడుకలు చిన్నతంలో, లేదా టీనేజీలో లాగా ఎగ్జైట్మెంట్ అనిపించవు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అలాంటి పీల్ వస్తుంది.

ఈ సారి నా బర్త్ డే సందర్భంగా చాలా ఎగ్జైట్ అయ్యాను. అందుకు కారణం పవన్ కళ్యాణ్ గారే, ఆయనకు కృతజ్ఞతలు… అంటూ జరిగిన విషయాన్ని చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ గారు సెట్స్ లోకి రాగానే వెంటనే లేచి గుడ్ మార్నింగ్ సర్ అన్నాను. ఆ… శివా అనేంతలో, దర్శకులు డాలీ, పవన్ కల్యాణ్ గారితో ఇవాళ శివ పుట్టినరోజు సర్ అని చెప్పారు. వెంటనే పవన్ గారు నా భుజం మీద చెయ్యవేసి నీకోసం ఏమన్నా చెయ్యాలోయ్ అంటూ ప్రొడక్షన్ అని పిలిచారు… వెంటనే ప్రొడక్షన్ చీఫ్ ఆయన ముందు హాజరయ్యారు.

ప్రొడక్షన్ చీఫ్ తో నాకొక కేక్ కావాలి.. పెద్దదిగా ఉండాలి… ఏం శివా బ్లాక్ ఫారెస్ట్ కేక్ నచ్చుతుందా? అన్నారు…. నేను అలాగే కళ్ళప్పగించి ఎస్ సార్ అన్నాను…. కొద్దిసేపటిలో అన్నీ అమరిపోయాయ్, నా భార్య మధుని పిలవచ్చా అని అడిగాను… పిల్లల్ని ఫ్యామిలీ మెంబర్స్ ని కూడా రమ్మనవోయ్ అన్నారు. పవన్ కళ్యాణ్ గారి మానవత్వానికి, ఆయన చేసే కొన్ని వేల సేవలలో, నా పుట్టినరోజునాడు ఆయన నాకిచ్చిన విలువ చాలా చిన్నదై ఉండొచ్చు. కానీ అంతటి మహామనిషి నాకు ఇంత విలువనివ్వటం!!! విలువకట్టలేని , మాటలలో చెప్పలేని మహదానుభూతి అని శివ బాలాజీ చెప్పుకొచ్చారు. అలాగే దర్శకుడు డాలీకి థాంక్స్ అని శివబాలాజీ వ్యాఖ్యానించారు.

Related

  1. పవన్ సీక్రెట్ ని శృతి బయటకి చెప్పేసిందిట
  2. త్రివిక్ర‌మ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన పవన్!
  3. పవన్ వల్ల మహేష్ సినిమాకి కష్టాలు!
  4. కొరటాల డైరెక్షన్లో ముఖ్యమంత్రిగా పవన్ సినిమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -