Tuesday, April 30, 2024
- Advertisement -

`పవర్ స్టార్` ట్రైలర్ రిలీజ్.. వర్మ టార్గెట్ మాములుగా చేయలేదు..!

- Advertisement -

ప్రస్తుతం ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా సినిమాలు రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకే వర్మ ఏం చేసిన ఓ సంచలనం అయ్యేలా చూస్తున్నారు. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో తొలిగా పవర్ స్టార్ మూవీని రిలీజ్ చేస్తున్నాడు. అయితే పవన్ కల్యాణ్ అభిమానులు మాత్రం ఆర్జీవీపై చాలా కోపంగా ఉన్నారు. ఇక ఈ పవర్ స్టార్ ట్రైలర్ ను ముందుగా 25 రూపాయాలు పెట్టి కొని చూడాలని చెప్పిన వర్మ.. ఇప్పుడు తన యూట్యూబ్ ఛానెల్ లోనే ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

పవర్ స్టార్ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత కథ అని ఆర్జీవీ చెప్పినట్టే తాజాగా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ఉంది. పవన్ కల్యాణ్ ని ప్రవణ్ కల్యాణ్ అనే పేరుతో పిలుస్తూ ఆర్జీవీ క్రియేట్ చేసిన పాత్రలన్నీ బోలెడన్ని సెటైర్లు వేస్తున్నాయి. ఇక ఇందులోనే చంద్రబాబు మాట విన్నందుకు పవన్ కల్యాణ్ కి ఈ గతి పట్టిందని… చెప్పుడు మాటలు విని మోసపోయినందుకు ఎన్నికల్లో ఓటమి పాలయ్యానని పవన్ గుర్తించినట్టు ఆర్జీవీ చెప్పదలిచారు. ఇక ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలయ్యాక అన్నయ్య చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తీరును ఎంతో ఫన్నీగా చూపించారు ట్రైలర్ లో. ఒక్కసీటు కూడా రాలేదా? అంటూ పవన్ ఆవేదన చెందుతుంటే నాదెండ్ల మనోహర్ డైలాగ్ ఎంతో ఫన్నీ.

ఒకసారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పురా .. నువ్వు పవర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేదా నా తమ్ముడిగానా? అంటూ చిరు డైలాగ్.. సత్య ప్రమాణకంగా చెబుతున్నాను బ్రదర్.. మీరు ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను.. అంటూ చంద్రబాబు డైలాగ్.. త్రివిక్రమ్ ని చొక్కా కాలర్ పట్టుకుని పవన్ ఊపేసే సీన్.. మాట్లాడితే సీఎం సీఎం అని గోలలు.. ఈలలు అంటూ పవన్ ఎమోషన్.. కత్తి మహేష్ ఇంటర్వ్యూ ఇవన్నీ ఫన్ సెటైర్ తో పవన్ అభిమానుల్ని మరిగించేవిగానే ఉన్నాయి. ప్యాకేజ్ స్టార్ .. అసమర్థుడు అంటూ తిట్టే ప్రయత్నం చేయడం చూస్తుంటే ఆర్జీవీపై పవన్ అభిమానులు కత్తులు నూరడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఈ చిత్రం ఈనెల 25న ఉదయం 11 గంటలకు ఆర్జీవీ వరల్డ్ థియేటర్ లో రిలీజ్ కానుంది.

ఉపాసన బర్త్ డేకి సర్ ఫ్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన చైతు సమంత ..!

హీరో అర్జున్ కూతురుకి కరోనా.. ఇప్పుడెలా ఉంది ?

ఒకేసారి 20కేజీలు తగ్గిన నమిత.. చూస్తే షాక్.!

అలియా భట్ సిగ్గు లేకుండా అవార్డు తీసుకుంది : కంగనా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -