సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే కోలీవుడ్ లో దేవుడు ల పూజిస్తారు. దేశవిదేశాలో సైతం అభిమానులన సంపాదించుకున్న సౌత్ నటుడు. కాంట్రావర్సీలకు ,పొలిటిక్స్ దురంగా ఉంటాడు రజినీ. సినీ పరిశ్రమకు చెందిన వాళ్లు సైతం రజినీని ఒక మాట అనరు.అలాంటిది ఓ దర్శకుడు తలైవాని నోటికొచ్చినట్లు తిట్టిపోతున్నాడట.
పరుత్తి వీరన్ తో నెషనల్ అవార్డు అందుకున్నఅమీర్ సూపర్ స్టార్ పై విమర్శలు గుప్పిస్తున్నాడు. 500.. 1000 నోట్లను రద్దు చేయడంపై రజినీకాంత్ స్పందించిన నేపధ్యంలో రజనీ ని టార్గెట్ చేశాడు అమీర్. నల్లధనం గురించి.. కరప్షన్ ఫ్రీ ఇండియా గురించి ఇప్పుడు మాట్లాడుతుతున్న రజినీ.. కబాలి’ సినిమా టికెట్లను వేల రూపాయలకు అమ్మినపుడు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించాడు. కబాలి టికెట్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారమే అమ్మారో లేదో ఆయనకు అవగాహన ఉందా? 120 రూపాయల కబాలి టికెట్ ను 2 వేలకు అమ్మి బ్లాక్ మనీని పోగేసుకోవడాన్ని ఆయన సమర్థిస్తారా? కబాలి బిజినెస్ గురించి ఆయన ఓపెన్ గా డిస్కస్ చేయగలరా? అంటూ రజినీ మీదికి చాలా ప్రశ్నలే సంధించాడు అమీర్.