తెలుగు ప్రేక్షకులు గత మూడేళ్లుగా అదరిస్తున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న వాళ్ల నుంచి పెద్దోళ్లవరకు వీరాభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్ లోని దీప అలియాస్ వంటలక్క అంటే ఇష్టపడని వారు ఉండరు. సీరియల్ లో తన నటనతో కన్నీళ్ళు పెట్టించే దీపకు ఎంతో మంది వీరాభిమానులు ఉన్నారు. బయట ఆమెకు స్టార్ హీరోయిన్ కు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. దీప అసలు పేరు ప్రేమి విశ్వనాధ్.
బుల్లితెర శోభన్ బాబుగా పేరు తెచ్చుకున్న నిరుపమ్ పరిటాల… కార్తీకదీపం సీరియల్ హీరోగా కార్తీక్ (డాక్టర్ బాబు) పాత్రతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. నటుడు నిరుపమ్ పరిటాల గురించి ప్రత్యేకంగా చెప్పన్నక్కర లేదు. అయితే గత కొన్ని రోజులుగా డాక్టర్ బాబు గొంతు మారిపోయింది. ఆ పాత్రకు ఎవరో డబ్బింగ్ చెబుతున్నారు. నిరుపమ్ నటిస్తున్న కుంకుమ పువ్వు, హిట్లర్ గారి పెళ్లాం సీరియల్లోనూ వేరే గొంతే వినిపిస్తోంది. బిజీగా ఉండటం వలన డబ్బింగ్ చెప్పడం కుదరడం లేదని తెలుస్తుంది.
అయితే నిన్నటి కార్తీకదీపం ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది… ’హిమ తల్లిదండ్రులను వెతకడానికి వెళ్తున్నాను వాళ్లు కనిపించాకే నేను తిరిగి వస్తాను’ అని డాక్టర్ బాబు ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. అంటే ఇక కొన్ని రోజులు పాటు అసలు డాక్టర్ బాబు క్యారెక్టరే సీరియల్లో ఉండక పోవచ్చా..? లేక ఇక పైన డాక్టర్ బాబు లేకుండానే సీరియల్‌ను నడిపించబోతున్నారా..? అనేది వేచిచూడాలి.
కార్తీక దీపం వంటలక్క పర్సనల్ లైఫ్ గురించి తెలుసా ?