Tuesday, April 30, 2024
- Advertisement -

దుబ్బాకలో బీజేపి గేలుపు కాదా..? హరీష్ రావుపై అదిష్టానం గేలుపేనా..?

- Advertisement -

తెలంగాణ వచ్చిన తర్వాత తిరుగులేని శక్తిగా ఎదిగిన టిఆర్ఎస్ పార్టీ కి గతంలో ఎప్పుడు లేనంతగా వ్యక్తిరేకత గత కొద్దీ కాలంగా ఉందని ప్రతిపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి.. అయితే అధికార పార్టీ మాత్రం దీన్ని కొట్టి పారేస్తోంది.. తెలంగాణాలో గులాబీ పార్టీ ప్రజలకు ఎప్పుడు విధేయతగా ఉంటుంది అందుకే ప్రజలు పార్టీ ను గెలిపిస్తూ వస్తున్నారు అని చెప్తున్నారు. అందుకే దుబ్బాక ఎన్నికలలో టీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ని దించింది. ఇక్కడే టిఆర్ఎస్ అదిష్టానం మాస్టర్ ప్లాన్ వేసిందా అనే అనుమానాలు వస్తున్నాయి.

అయితే దుబ్బాక ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ ఘోర ఓటమి పాలైంది. ఇది ఆర్థిక మంత్రి హరిష్‌రావు ఓటమిగా అందరూ పరిగణిస్తున్నారు. దీనికి తోడు హరిష్‌రావు పరిస్థితి టీఆర్‌స్‌లో అంత బాగో లేదు అని చెప్పాలి. ఇప్పటికే పార్టీలో ఓ వ్యతిరేక వర్గం తయారవుతందని గమనించిన కేసీఆర్‌.. దానికి మూల కారణం హరిష్‌రావుగా గుర్తించినట్లు తెలుస్తోంది. పార్టీ రెండోసారి గెలిచినప్పుడు హరిష్‌రావుకి మొదటిలో మంత్రి పదవిని కట్టబెట్టలేదు. అప్పుడే హరిష్‌రావు ను తొక్కేస్తారని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడు రాజకీయ పరిస్థితుల ప్రభావం వలన తిరిగి మంత్రి పదవిని ఇచ్చి సత్కరించారు. కానీ ఇప్పుడు ఈ ఓటమికి కారణం మొత్తం హరిష్ రావు మీద తోసేసి పగ్గాలనుంచి తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వినికిడి.

ఓకనోక సమయంలో హరీష్‌ రావు బీజేపీ కండువా కప్పుతాడని బాగా ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి హరీష్‌ ను తప్పిస్తే తరువాత ఆయన అడుగులు బీజేపీ వైపే అని అందరికి అర్థం అవుతుంది. ప్రస్తుతం గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో ఉన్న కేసీఆర్‌ హరీష్‌ గురించి ఆలోచించలేదు అని రాజకీయ విశ్లేష​కులు అంటున్నారు. మరి తన సోంత నియోజకవర్గం లో చాలా మొజార్టీతో గెలిచిన హరీష్ పార్టీ గెలుపులో ఎందుకు పని చేయడంలేదని అందరి ప్రశ్న. దీనికి జవాబు సగటు ఓటరు దగ్గర తప్ప మరి ఏవరి వద్ద సమాధానం దొరకదు.

ఎందుకంటే దుబ్బాక ఎన్నికలలో హరీష్‌ రావు వన్ మ్యాన్ పోరాటం. హరీష్‌ రావు ఎవ్వరు వద్దు అన్న.. ప్రతిస్టాత్మకంగా జరుగుతున్న ఎన్నికపై అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎపటికప్పుడు పరిస్తుతులు తెలుకుంటునే ఉంటుంది. ఇక్కడ అలాంటి పరిస్థి తలేతుతున్నా.. అదిష్టానం మౌనం ఎందుకు వహించింది..? అప్పుడైనా ప్రచారంకి కేటిఆర్, కేసీఆర్ ఎందుకు పూనుకోలేదు..? ఓటమీ తేలిసే వీరు పూనుకోలేదా..? లేదా హరీష్‌ రావు దూకుడుకి చెక్ పెట్టెందుకేనా..? అనే అనుమానాలు నెమ్మది నెమ్మదిగా వెలుగులోకి వస్తునాయి.

అంతే కాదు గ్రేటర్ పోరు బరిలో నిలుచున్న అభ్యర్థులు ఎంపికలో హరిష్‌ రావు జోక్యం లేదని, అసలు అలాంటి అవకాశం కూడా పార్టీ పెద్దలు ఇవ్వలేదని రాజకీయ చర్చ జరుగుతుంది. మరి గ్రేటర్‌ పరిధిలో హరిష్‌ ఎంత మేరకు మ్యాజిక్‌చేసి ఓట్లు తెప్పిస్తారని అందరూ ఎదరు చూస్తున్నారు. అంతే కాదు దుబ్బాక పలితం గ్రేటర్ పోరు లో ఎంత మేర ప్రభావితం చేస్తుందో చూడాలి.

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

దుకుడు తగ్గించిన సోము వీర్రాజు కారణం ఎంటో..?

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -