Thursday, March 28, 2024
- Advertisement -

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

- Advertisement -

చిత్తూరు జిల్లా తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వేడి ఇప్పుడిప్పుడే రాజుకుంటోంది. ఇప్పటికే టీడీపీ కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ మాజీ నాయకురాలు పనబాక లక్ష్మిని తిరుపతి ఉప ఎన్నిక బరిలో దింపింది. ఇక అధికార పార్టీ తరుపు నుంచి ఎవరు బరిలోకి దిగుతారా అన్న ఆలోచనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతి లోక్‌సభ పరిధిలోకి వచ్చే చిత్తూరు, నెల్లూరు జిల్లాల నేతలతో సమావేశం అయ్యారు. తిరుపతి లోక్‌సభ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్‌రావు కరోనాతో మృతి చెందడం, ఆ స్థానం నుంచి పోటీ చేయడానికి దుర్గాప్రసాద్‌ సతీమణి విముఖత చూపడం.. ఈ క్రమంలో తన కుమారుడు కళ్యాణ చక్రవర్తికి తిరుపతి టికెట్‌ ఇవ్వాల్సిందిగా దుర్గాప్రసాద్‌ సతీమణి జగన్ ని కోరడం ఆయన ఈ విషయాన్ని పక్కన బెట్టినట్టు సమాచారం.

అయితే మార్చిలో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ పదవుల్లో ఒకటి ఇస్తామని వారికి రాయబారం పంపినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపైకి కొత్త పేరు వచ్చినట్టు సమాచారం. సీఎం జగన్ పాదయాత్ర సమయంలో.. తన వెంట నడిచిన ఫిజియోథెరపిస్ట్‌ గురుమూర్తికి అవకాశమివ్వాలన్న యోచనలో ఉన్నట్టు సమాచారం. అంతే కాదు దుర్గాప్రసాద్‌ కుటుంబ సభ్యులను పిలిచి తన మనసులోని మాట చెప్పాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. 

మొదటి నుంచి తనను నమ్మినవారికి తనకు నమ్మకం ఉన్నవారికి సీట్లు కేటాయిస్తూ వస్తున్నారు జగన్. బాపట్లలో ఒక సామాన్యుడు గ్రామ స్థాయి నేత కూడా కాని నందిగం సురేష్‌కు ఎకాఎకీగా పార్లమెంటు టికెట్‌ ఇచ్చి జగన్‌ గెలిపించుకున్నారు. ఇక గురుమూర్తిని ఎంచుకోవడం మరో కారణం ఉందట.. అదే ఆయన చిత్తశుద్ది అంటున్నారు.

ఏది ఏమైనా జగన్ మొదటి ఏ విషయంలో అయినా మాట ఇచ్చారంటే.. మడమ తిప్పే ప్రసక్తి లేదని అంటున్నారు.. ఆ మద్య జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి అనుమతి దొరకని గురుమూర్తి అనుకోకుండా కలిసి తన వద్ద ఉద్యోగం ఇచ్చారు.. ఇప్పుడు ఏకంగా ఎంపీ పదవీనే కట్టబోతున్నారు.. దటీజ్ జగన్ అంటున్నారు పార్టీ నేతలు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

విద్యార్థులకు జగన్ సర్కార్ భారీ ఊరట

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతిపై జగన్ కన్నెర్ర

ప్రజలకు మాటిచ్చిన జగన్.. అస్సలు మాట తప్పడట..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -