Wednesday, April 24, 2024
- Advertisement -

టీడీపీ కి వారే శత్రువులుగా మారుతున్నారా..?

- Advertisement -

రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ దూకుడు గురించి అందరికి తెలిసిందే. ఓ వైపు ప్రజలకు మంచ్ పరిపాలన అందిస్తూనే మరోవైపు అవినీతి పరుల అంతు తెలుస్తున్నాడు.. ఇటీవలే కొంతమంది టీడీపీ నేతలను సైతం జైలుకు పంపిన వైనం మనం చూసాం..చంద్రబాబు హయాంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు అవినీతుల గురించి అందరికి తెలిసిందే.. రాజధాని పేరు చెప్పుకుని టీడీపీ అధినేత సైతం ప్రజలను దోచుకున్నారు.. దాంతో చంద్రబాబు వైఖరికి ప్రజలు విసిగిపోయీ అధికారం జగన్ కి అప్పగించారు.. అయితే ప్రజల నమ్మకాన్ని ఏమాత్రం కోల్పోకుండా జగన్ అవినీతి పరులని జైలుకి పంపుతూనే తాను ప్రజలకు న్యాయం చేసే విధంగా పాలన చేస్తుండడం ప్రజల్లో ఎంతో ఆనందం వ్యక్తమవుతుంది..

అదేవిధంగా ప్రజలలో ఎక్కడ బలం తక్కువ వుంది అన్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని రాజకీయం చేస్తున్నాడు.. అలాగే కుల రాజకీయాన్ని ఎక్కువగా చేసే చంద్రబాబు ని కూడా అదే అంశంపై దృష్టి పెట్టి ఆయన్ని దెబ్బ తీయాలని చూస్తున్నాడు.. వాస్తవానికి ఓడిపోయినా చంద్రబాబు కు ఇంకా కమ్మ కులంలో మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.. దాంతో జగన్ ఆ వర్గాన్ని చంద్రబాబు కు దూరం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు.. ఆ క్రమంలోనే కమ్మవారిని పార్టీ లో చేర్చుకునే విధంగా జగన్ వ్యూహం సిద్ధం చేశారు. ఇప్పటికే కొంతమంది నేతలను పార్టీ లోకి చేర్చుకోగా ఇప్పుడు మరికొంతమందికి వల వేయడానికి సిద్ధమవుతున్నారు..

ఇక ఎప్పుడూ లేనంత అభ‌ద్రతా భావంతో ఈ వ‌ర్గం నేత‌లు ఉన్నార‌న్నది స్పష్టంగా తెలుస్తోంది. త‌మ వ‌ర్గానికి భ‌విష్యత్తులో స‌రైన నేత లేడ‌న్న సందేహంతో కూడా చాలా మంది ఈ వ‌ర్గం నేత‌లు ఎవ‌రి దారి వారు వెతుక్కుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు టీడీపీకి గ‌త ఎన్నికల్లో కేవ‌లం 23 సీట్లు వ‌స్తే అందులో 11 మంది క‌మ్మలే ఉన్నారు. గెలిచిన ముగ్గురు ఎంపీల్లోనూ ఇద్దరు క‌మ్మ ఎంపీలే. క‌ర‌ణం బ‌ల‌రాం, వంశీ పార్టీ మారి చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ఇక మిగిలిన క‌మ్మ ఎమ్మెల్యేల్లో ప‌య్యావుల కేశ‌వ్‌, గొట్టిపాటి ర‌వి లాంటి వారిపై అనేక సందేహాలు ఉన్నాయి. ఎంపీల్లో నాని, జ‌య‌దేవ్ ఇద్దరూ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ? తెలియ‌ని ప‌రిస్థితి. ఈ నేపథ్యంలో టీడీపీ కి కమ్మవారి బలం తగ్గుతుందని చెప్పడం లో ఎలాంటి సందేహంలేదు..

అనవసరపు అరుపులు ఎందుకు చంద్రబాబు..?

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

ఈ టీడీపీ లీడర్లు మౌనంగా ఉండడం ఏంటి..?

చంద్రబాబు ఈ పిచ్చి నమ్మకానికి కారణం ఇదేనా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -