Saturday, April 27, 2024
- Advertisement -

ఎమ్మెల్యే కొడుకులు వర్సెస్ యువనాయకుడు… ఎక్కడో తెలుసా..?

- Advertisement -

వైఎస్ జగన్ 2019 ఎన్నికల్లో సీఎం కావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు, కోరుకోవడమే కాకుండా ఆయన్ను సీఎం చేయడానికి ఎవరి పాత్ర వారు పోషించారు. పార్టీ లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్తలు కూడా జగన్ విజయం కోసం నిరంతరం క‌ృషి చేశారు. వైసీపీ బి గ్రేడ్ నాయకులు జగన్ విజయం సాధించడానికి పగలనక రాత్రనక కష్టపడ్డారు. వైసీపీ అగ్ర నాయకులు కూడా బి గ్రేడ్ నాయకులు మీద భారం వేసి, తమ వ్యాపారాలు తాము చేసుకున్నారు. అయితే వైసీపీ విజయం కోసం నిజంగా కష్టపడింది మాత్రం బి గ్రేడ్ నాయకులే. పార్టీ కార్యకర్తలను అనుసంధానం చేసుకుంటూ గ్రామాలలో పార్టీ పరిస్థితిని అంచనా వేయడంలో ఈ బి గ్రేడ్ నాయకులు సక్సెస్ అయ్యారు. వీరి సహకారంతోనే మెజార్టీ గ్రామాలలో వైసీపీ ఘన విజయం సాధించగలిగింది. అయితే కొన్ని నియోజకవర్గాలలో ఇప్పుడు బి గ్రేడ్ నాయకులకే మొండిచేయి చూపిస్తున్నారు అనేది బహిరంగ నిజం. వైఎస్సార్సీపీ విజయం కోసం నిరంతరం కష్టపడిన వారికి అన్యాయం చేస్తున్నారనే మాటలు వినిపిస్తున్నాయి.

తాజాగా గుంటురు జిల్లాలో ఓ యువ నాయకుడుకు ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది అంట.. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే గుంటురు జిల్లాకు చెందిన డెల్టా రిజ్వర్డ్ నియోజకవర్గానికి సంబంధించిన ఓ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువ నాయకుడు పార్టీ విజయం కోసం చాలానే కష్టపడ్డారు. జగన్ పార్టీ పెట్టిక ముందు నుంచే ఆయన వెంట నడిచారు. ఆయన ఏదో టిక్కెట్ ఆశించో లేక, పార్టీ పదవుల కోసమో పని చేయలేదు. జగన్‌ను సీఎంగా చూడాలనే తన కలను నిజం చేయలని పరితపించారు. దాని కోసమే కష్టపడి నియోజకవర్గంలో ఊరురా తిరిగి పార్టీ విజయానికి దోహదపడ్డారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు.

ప్రతిరోజూ పలు టీవీ చర్చ కార్యక్రమాల్లో కూడా పార్టీ తరుపున తన వాయిస్ బలంగా వినిపిస్తుంటారు ఆ యువనాయకుడు. నియోజకవర్గంలో విజయం కోసం తన సొంత డబ్బులు కూడా ఖర్చు చేసి అప్పులపాలైయ్యారట ఆ యువనాయకుడు. అయితే పార్టీతో పాటు తన కష్టపడిన నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా విజయం సాధించడంతో ఆ యువనాయుకుడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. అయితే ఆ ఆనందం ఎంతోకాలం నిలవలేదు అంట. గెలిచాక నియోజకవర్గంలో తెరపైకి ఎమ్మెల్యే ఇద్దరు కుమారులు రావడంతో ఆధిపత్య పోరు మొదలైంది అంట.. ఆ యువనాయకుడిని పైకి రాకుండా అణకతొక్కడానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇద్దరు కొడుకులు చూస్తున్నారట.. ఆ యువనాయకుడుకి సీఎం జగన్‌‌తో మంచి సంబంధాలే ఉన్నాయి. తరుచుగా జగన్‌ను వెళ్లి కలిసే పరిచియాలు ఉండటాన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే కొడుకులు చూసి తట్టుకోలేకపోతున్నారట..

దీంతో ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే కొడుకులు ఆ యువ నాయకుడి పై అనేక కుట్రలు పన్నుతున్నారు. అతనితో ఎవరు కూడా మాట్లడకూడదని ఆంక్షలు విధిస్తున్నారట. సోషల్ మీడియాలో కూడా అతన్ని ఎవరు ఫాలో అవ్వకూడదని మీకు ఏమైనా కావాలి అంటే మేము చూసుకుంటాం అతని ఫోటో కూడా మీరు బ్యానర్ లలో వేయకూడదు అని నిబందనలు విధిస్తున్నారట ఆ ఎమ్మెల్యే కొడుకులు. అలానే ఆ ఎమ్మెల్యే కొడుకులు తమ ఫొటోస్ కచ్చితంగా వేయాలి అని హుకుం జారీ చేశారట.. ప్రస్తుతం ఎమ్మెల్యే ఇద్దరి కొడుకు ల మధ్య కూడా అధిపత్యపోరు నడుస్తోంది అని టాక్ . వచ్చే ఎన్నికల నాటికి నాకు టిక్కెట్ అంటే నాకు టిక్కెట్ అంటున్నారట వీళ్ళు..

ఇక ఇసుక దోపిడి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేకుండా పోయింది. నెలకు వచ్చే సరికి కోట్ల రూపాయిలు చేతులు మారుతున్నాయని సమాచారం అందుతోంది. అధికారం, డబ్బు అండతోనే వారు ఇలా రెచ్చిపోతున్నారని నియోజకవర్గ ప్రజలు కూడా చెబుతున్నారు. తన ఆవేదనను ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితిలో తన సన్నిహితుల దగ్గర చెప్పుకుని బోరుమన్నడట.. తన సొంత డబ్బులు ఖర్చు పెట్టి పార్టీకోసం , ఎమ్మెల్యే కోసం పని చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే కొడుకులు ఇలా ఆ యువనాయకుడుని తొక్కేస్తున్నారనే మాటలు నియోజకవర్గంలో కూడా బాగానే వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికార పార్టీ ఎమ్మెల్యే ఇప్పటికైన కలుగుజేసుకుంటారేమో చూడాలి మరి.

దటీజ్ జగన్ స్టైల్.. నమ్మిన మనిషికే పట్టం కడతారా?

కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ మార్క్ ప్లాన్..!

స్థానిక బలాన్ని నమ్ముకుంటున్న జగన్..

చంద్రబాబు మించిన జగన్ రాజకీయ ఎత్తుగడ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -