Friday, May 9, 2025
- Advertisement -

6.1 లక్షల మంది లబ్ధిదారలకు కేంద్రం సొంత ఇల్లు..!

- Advertisement -

ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన – గ్రామీణ పథకంలో భాగంగా రూ.2,691 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం విడుదల చేయనున్నారు.

ఈ నిధులతో యూపీలోని 6.1 లక్షల మంది గ్రామీణ పేదలకు లబ్ధి చేకూరనుంది. మొదటి విడతలో 5.30 లక్షలు, రెండవ విడతలో 80 వేల మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు పీఎంఓ తెలిపింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 1.26 కోట్ల ఇళ్లు నిర్మించినట్టు పేర్కొంది.

2022 నాటికి అందరికీ పక్కా గృహాలు అందించాలనే లక్ష్యంతో 2016 నవంబర్​లో మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద మైదాన ప్రాంతాల్లోని లబ్ధిదారులకు 100శాతం గ్రాంట్​గా రూ.1.20 లక్షలు, కొండప్రాంతాలు, ఈశాన్యరాష్ట్రాలు, జమ్ముకశ్మీర్, నక్సలిజం ప్రభావిత ప్రాంతాల్లో రూ 1.30 లక్షలు అందిస్తారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -