మరో ఎమ్మెల్యే హౌస్ అరెస్ట్..!

- Advertisement -

తెలుగుదేశం నేతల గృహ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. పార్టీ సీనియర్ నేత కళా వెంకట్రావును కలిసేందుకు సిద్ధమైన ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు రాత్రి శ్రీకాకుళం జిల్లా రాజాంలో అదుపులోకి తీసుకున్నారు.

వైసిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన సందర్భంగా ఆయన వాహన శ్రేణిపై రాళ్లు, చెప్పులు వేయించారనే అభియోగంపై టిడిపి అధినేత చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, పొలిట్ బ్యూరో సభ్యుడు వెంకటరావుపై ఇటీవల కేసు నమోదైంది.

- Advertisement -

ఈ కేసులోనే కళా వెంకటరావును పోలీసులు అదుపులోకి తీసుకుని.. తర్వాత వదిలిపెట్టారు. ఆయనను పరామర్శించేందుకు వెళ్తుండగా.. అశోక్​ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News